prabhas( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Prabhas birthday updates: ప్రభాస్ పుట్టిన రోజున అభిమానులకు ఫుల్ మీల్స్.. ఆ రోజు వచ్చేవి ఇవే..

Prabhas birthday updates: ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తన రాబోయే మూడు ప్రాజెక్టుల నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనిని సంబంధించి అక్టోబర్ 23న అన్నీ సిద్దంగా ఉన్నాయని టాక్.
అయితే ఆరోజు ప్రభాస్ తాజాగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజాసాబ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. అలాగే ఫౌజి సినిమా నుంచి పోస్టర్, బాహుబలి ఎపిక్ సినిమా నుంచి ట్రైలర్ రానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకే సారి మూడు ప్రాజెక్టుల నుంచి అప్టేట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Read also-Dude movie review: ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ ప్రేమ కథ ఫలించిందా?.. తెలియాలంటే?

‘ది రాజాసాబ్’ సినిమా ప్రభాస్‌లో కొత్త డైమెన్షన్ చూపించనుంది. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ హారర్-కామెడీ ఫాంటసీ డ్రామా, 2026 జనవరి 9న విడుదల కాబోతుంది. ధమన్ సంగీత సారధ్యంలో శ్రీమణి లిరిక్స్‌ అందించిన ట్రాక్ లో ప్రభాస్ రాజస్థానీ లుక్‌లో కనిపించడం హైలైట్ గా ఉంటుందని మూవీ టీం తెలిపింది. పాటలో అతను రాజా పాత్రలో డాన్స్ చేస్తూ, హారర్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసి ఎంటర్‌టైన్ చెయనున్నట్లుగా తెలుస్తోంది.

అదే రోజున ‘ఫౌజీ’ సినిమా నుంచి వచ్చిన టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేసింది. హను రాఘవపుడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్, 2026 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఫౌజీ’ అధికారిక టైటిల్ కూడా అదే రోజున విడుదల కాబోతుందని దర్శకుడు ఇప్పటికే చెప్పాడు. “ఇది ప్రభాస్ మాస్ యాక్షన్ ’ అవుతుందని అభిమానులు ఆసిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో ‘ఫౌజీ’బజ్ మరింత పెరిగింది.

Read also-Telusu Kada movie review: సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు హీరోయిన్లతో చేసిన రొమాన్స్ కనెక్ట్ అయ్యిందా?.. ‘తెలుసుకదా’ రివ్యూ

అయితే, మూడో అప్‌డేట్ ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్ రానుంది. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో 2015-2017లో వచ్చిన ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి, రీ-కట్ చేసి, రీ-మాస్టర్డ్ వెర్షన్. IMAX ఫార్మాట్‌లో అక్టోబర్ 31, 2025న విడుదల చేయనున్నారు. ట్రైలర్‌లో ప్రభాస్ బాహుబలి లుక్, రాణా భల్లాలదేవుడు, అనుష్క, తమన్నా, రమ్యా కృష్ణ క్యారెక్టర్స్ మెరిసాయి ఈ సారి మరింత షైనింగ్ గా కనిపిస్తాయని నిర్మాత తెలిపారు. ఎపిక్ వార్ సీన్స్, ఎమోషనల్ డ్రామా, మ్యూజిక్ అన్నీ కలిసి అభిమానులను మరో లోకానికి తీసుకెళ్తాయని మూవీ టీం చెబుతోంది. ఏది ఏమైనా ఈ మూడు అప్డేట్ లను కలిపి ఒకే రోజు రావడంతో అభిమానుల ఉత్సాహం ఆకాషాన్నంటింది. అయితే రాబోయే ట్రీట్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!