CPM – Raj Bhavan: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి రాజ్ భవన్ వరకూ జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున సీపీఐ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో రాజ్ భవన్ కు చేరుకున్న సీపీఐ నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భారీ ర్యాలీగా వెళ్లిన సీపీఎం నేతలను కలిసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిరాకరించారు. దీంతో రాజ్ భవన్ సెక్యూరిటీ సిబ్బంది సీపీఐ నేతలను లోనికి అనుమతించలేదు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ నేతలు.. రాజ్ భవన్ గేటు ఎదుటనే భైఠాయించారు. గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వని కారణంగా.. రేపు గవర్నర్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయనున్నట్లు హెచ్చరించారు.
Also Read: Karimnagar Crime: కత్తి సురేష్ హత్య.. కూరలో వయాగ్రా టాబ్లెట్స్ కలిపిన భార్య.. ఆపై ఉరేసి ఘాతుకం
ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి ముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి అడ్డుకున్నారని.. ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ ఆమోదించలేదని పేర్కొన్నారు. ఇటీవల జీవో 9పై హైకోర్టు స్టే సైతం విధించిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు అన్ని రకాలుగా కేంద్రం అడ్డుపడుతోందని జాన్ వెస్లీ మండిపడ్డారు. గవర్నర్ పోస్ట్ మాన్ లా కాకుండా రాజ్యాంగ విలువలు కాపాడే వ్యక్తిగా వ్యవహరించాలని హితవు పలికారు.
