CPI Narayana: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌పై సీపీఐ నారాయణ (CPI Narayana) ఎప్పటి నుంచో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆ షో మంచిది కాదు, జనాలపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుందని, వెంటనే దానిని ఆపేయాలని ఆయన పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)పై కూడా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. గజ్వేల్‌కు చెందిన కొందరు, ఈ షోను వెంటనే ఆపేయాలని, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారనే విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్‌పై మరోసారి సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఛానల్‌లో.. ‘‘ఎక్కడ చెడు జరుగుతున్నా, ఎక్కడ సమస్య ఉన్నా.. కమ్యూనిస్ట్ పార్టీ తరపున అక్కడకు వెళ్లి ఉద్యమాలు చేసి, ఆ సమస్యను, చెడును సరిచేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలా బిగ్ బాస్‌లోని చెడుని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కనుక బిగ్ బాస్ నుంచి ఆఫర్ వస్తే, దానిని సరి చేయడానికి వెళతారా?’’ అనే ప్రశ్న సీపీఐ నారాయణకు ఎదురైంది.
Also Read- Tollywood: టాలీవుడ్‌లో ఇతర భాషల సినిమాలు బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా?
అదొక వ్యభిచార కొంప
దీనికి సీపీఐ నారాయణ సమాధానమిస్తూ.. బయట నుంచి దానిపై ఫైట్ చేస్తాను తప్పితే.. లోపలికి వెళ్లి ఏం చేస్తాం. బిగ్ బాస్ అనేదే ఒక వ్యభిచార కొంప అయితే.. దానిలోకి వెళ్లి కాపురం చేయమంటారేంటి? దానిని బయట నుంచి సంస్కరించాలి. దానిపై ఫైట్ చేస్తామే గానీ, లోపలికి ఎందుకు వెళతాను. ఆ కొంపే అట్టాటి కొంప అయితే.. దానిలోకి వెళ్లి సరిచేయమంటారేంటి? దానిని సంసార పక్షం చేయడమనేది ఉండదు. అందులోకి వెళితే మనం కూడా అందులో కలిసిపోతాం. ఆ సిస్టమ్ వేరు. అది చెడు సాంప్రదాయాన్ని సృష్టిస్తుందని ఎక్స్‌పోజ్ చేస్తున్నా. అందులో ఉండేవారు బంధువులు కాదు, కొత్తవాళ్లని, పెళ్లికానీ యూత్‌ని అందులోకి తీసుకెళ్లి, 100 రోజులు అందులో పెట్టి, తిని, తిరగండి అంటే.. దాన్ని ఏమంటారు? అదేమంటే సోషల్ బిహేవియర్ అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ సంబంధాలు ఇంకెక్కడైనా ఉన్నాయా? మనకి వాళ్లు నేర్పించాలా? వాళ్లకి లేదు. పాశ్చాత్య పోకడ వాళ్లది. 18 సంవత్సరాల తర్వాత వాళ్లు బయటికి వెళ్లిపోతారు. తల్లిదండ్రులను చూసుకోరు. వాళ్లు కూడా పంపించేస్తారు. మనకి అలా కాదు కదా.. మనకి వచ్చి నేర్చించేది ఏంటి వాళ్లు?
Also Read- Anshu: నాగార్జున హీరోయిన్ జాకెట్ లెస్ ఫోటోషూట్.. ‘ఈ వయసులో అవసరమా?’ అంటూ విమర్శలు!
నాగార్జున కూడా పారిపోయాడు
దీని ద్వారా ఈ షో నిర్వాహకులు కోట్ల రూపాయలను సంపాదించుకుంటూ ఉంటారు. మనవాళ్లేమో టీవీల ముందు కూర్చుని సొల్లు కార్చుకుంటూ దానిని చూస్తూ ఉంటారు. నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టా. అప్పుడు సజ్జనార్ ఉన్నాడు. ఆయన రెండు నెలల తర్వాత నువ్వు కోర్టులోకి వెళ్లి ఒక నోటీస్ ఇప్పించు అన్నాడు. కోర్టుకు పోయా. రిజిక్టెడ్. జిల్లా కోర్టుకు పోయా.. రిజిక్టెడ్. హైకోర్టుకు పోయా.. పెండింగ్. మొన్నీ మధ్య ఓ జడ్జి వచ్చి, దాన్ని రివైజ్ చేసి నోటీసు ఇచ్చారు. మాకు నోటీస్ ఇచ్చారు. మేము ఇస్తే లేటవుతుంది.. మీరే తీసుకెళ్లి ఇవ్వండి అని మాకు ఇచ్చి పంపించారు. నేను మావాళ్ల ద్వారా పంపించా. ఎవరూ తీసుకోలేదు. మాకసలు సంబంధమే లేదని తలుపులు వేసుకున్నారు. నాగార్జున కూడా పారిపోయాడు. మళ్లీ కోర్టుకు ఇచ్చాం.. మీరే ఇవ్వండి అని. తర్వాత నోటీసు పంపించారు. ఈ నోటీసు తీసుకున్నారు. నాగార్జున ఇంకా తీసుకోలేదు. కోర్టులో విచారణకు వస్తుంది. నా ఉద్దేశం ఏమిటంటే.. దీనిని బయట ఎక్స్‌పోజ్ చేయాలి, అలాగే కోర్టులో కూడా ఎక్స్‌పోజ్ చేయాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
