John Wesley ( image credit: swetcha reporter)
Politics, తెలంగాణ

John Wesley: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం నాటకం.. సీపీఐ నేత జాన్‌వెస్లీ కీలక వ్యాఖ్యలు

John Wesley: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకమాడుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ (John Wesley) విమర్శించారు. ఒకవైపు కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును, ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటూ ఇంకోవైపు రాష్ట్రంలో ఈనెల 18న బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌కు బీజేపీ మద్దతు ఇచ్చిందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసిందన్నారు. రిజర్వేషన్లను అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిమాండ్‌ చేశారు.

Also Read: John Wesley: బీసీ రిజర్వేషన్లపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి: జాన్ వెస్లీ

8న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రబంద్‌లో పాల్గొంటాం 

కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పోరాడితేనే ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రబంద్‌లో పాల్గొంటామనీ, లేదంటే స్వతంత్రంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో బీసీ సంఘాలు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు భాగస్వాములు కావాలని కోరారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తీరుకు నిరసనగా  చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని వివరించారు. ఆర్నెల్లైనా ఆమోదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను ఆమోదించి గవర్నర్‌కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో 9ని విడుదల చేసిందన్నారు. ఆ జీవోపై హైకోర్టు స్టే విధించిందని చెప్పారు. ఆ స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్‌ను తిరస్కరించిందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రజా ప్రతినిధులు అడుగుతారా?

బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులు అడుగుతారా? అని ప్రశ్నించారు. బీసీ జేఏసీ నేతలు ఆలోచించాలనీ, కేంద్రం తీరుకు వ్యతిరేకంగా బంద్‌ నిర్వహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలనీ, కేంద్రంపై పోరాడాలని సూచించారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశంలో సీపీఐ(ఎం) మద్దతునిస్తుందని చెప్పారు. ఈనెల 18న బీజేపీకి వ్యతిరేకంగా బంద్‌ చేపడితే పాల్గొంమని, లేదంటే అదేరోజు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండలాలు, పట్టణాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, బైక్‌ యాత్రలు నిర్వహిస్తామని, కేంద్రం తీరును నిరసిస్తామన్నారు.

బీజేపీ ఉన్న వేదికల్లో తాము పాల్గొనేది లేదు 

ఇందులో బీసీ సంఘాలు, అభ్యుదయ సంఘాలు, ప్రజాతంత్రవాదులు పాల్గనాలని కోరారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకునే రాజకీయ పార్టీని అందరూ గుర్తించాలన్నారు. బీజేపీ ఉన్న వేదికల్లో తాము పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. తాము స్వతంత్రంగా ఉద్యమాలను చేపడతామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అఖిలపక్షం సహకారంతో ఢిల్లీకి కేంద్రంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి. సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: John Wesley: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ వ్యతిరేకం: జాన్ వెస్లీ

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?