Bandi Sanjay ( IMAGE CREDIT:TWITTER)
తెలంగాణ

Bandi Sanjay: క్రీడా రంగంపై కేంద్రం ఫోకస్.. యువతకు ఇదే మంచి ఛాన్స్.. బండి సంజయ్

Bandi Sanjay: దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి జీవితంలో క్రీడలను ఒక జీవనశైలిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  (Bandi Sanjay Kumar) తెలిపారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో క్రీడా రంగంలో యువతకు అద్భుతమైన అవకాశాలు సృష్టించే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీనగర్ కు వెళ్లారు. గతంలో తెలంగాణలో వివిధ జిల్లాల్లో పనిచేసి ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ డీజీపీగా కొనసాగుతున్న నళిని ప్రభాత్ సహా ఉన్నతాధికారులు శ్రీనగర్ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రికి ఘనస్వాగతం పలికారు.

Also Read:Bandi Sanjay: దేశానికి ఆదర్శం చర్లపల్లి జైలు: కేంద్ర మంత్రి బండి సంజయ్

క్రీడా సంస్కృతిని ప్రతి స్థాయిలో విస్తరించాలనే లక్ష్యం

పర్యటనలో భాగంగా ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్(మహిళలు, పురుషల విభాగం) ముగింపు ఉత్సవాలకు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అత్యుత్తమ కనబర్చిన ఆటగాళ్లకు బండి సంజయ్ బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో ప్రపంచస్థాయి మౌలిక వసతులతో జాతీయ క్రీడలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని ప్రతి స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీస్, పారామిలిటరీ సిబ్బందిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ వంటి జాతీయ కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు.

Also ReadBandi Sanjay: ఆ జిల్లాలో జెడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటాం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!