Jatadhara Movie: యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సుధీర్ బాబు (Sudheer Babu) తన రాబోయే చిత్రం ‘జటాధర’ (Jatadhara) ప్రమోషన్స్‌ను వినూత్నంగా, ఆసక్తికరంగా ప్రారంభించారు. సాధారణ ప్రెస్ మీట్‌లు కాకుండా, సినిమాలోని మూడ్‌కు తగినట్టుగా క్లాసిక్ హారర్ సెటప్‌లో ఈ ప్రచారాన్ని మొదలుపెట్టడం ఆసక్తిని కలిగిస్తోంది. ఆయనకు హిట్ వచ్చిన ‘ప్రేమ కథా చిత్రమ్’ థీమ్‌లా అనిపించినా, చాలా వెరైటీగా ఈ ప్రమోషన్ ఉంది. తన ఫ్రెండ్‌లో కలిసి ఓ పాత, పాడుబడిన హంటింగ్ హౌస్‌లోకి వెళ్లిన సుధీర్ బాబు.. ఘోస్ట్ మీటర్‌తో సందడి చేశారు. సుధీర్ బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన ఈ ప్రమోషనల్ వీడియోలో గుబురుగా పెరిగిన పొదలు, అర్ధరాత్రి వేళ పూర్ణ చంద్రుడు, గబ్బిలాలు ఎగురుతున్న ఆ వాతావరణం సినిమా నేపథ్యాన్ని సూచిస్తోంది. (Jatadhara Trailer Launch Update)
Also Read- Anshu: నాగార్జున హీరోయిన్ జాకెట్ లెస్ ఫోటోషూట్.. ‘ఈ వయసులో అవసరమా?’ అంటూ విమర్శలు!
ఘోస్ట్ మీటర్ పెట్టి.. ఘోస్ట్‌తో డిస్కషన్
భయానక వాతావరణంలో, గందరగోళంగా ఉన్న ఇల్లు, ఎక్కడ చూసినా దట్టంగా కప్పి ఉన్న సాలెగూళ్లతో ఉంది. ఈ సెటప్‌లో సుధీర్ బాబు, అతని ఫ్రెండ్ మధ్య జరిగిన సంభాషణ చాలా సరదాగా సాగింది. సుధీర్ బాబు అక్కడ హారర్ సినిమాకు అనుగుణంగా ఉన్న ‘ఘోస్ట్ మీటర్’ను ఉపయోగించడం, భయపడుతున్న తన స్నేహితుడితో.. ‘ఒకడు చాలా మందిని చంపితే, గవర్నమెంట్ వాడిని ఇక్కడే ఉరి తీసిందట. అప్పటి నుంచి వాడు ఇక్కడే దెయ్యమై తిరుగుతున్నాడంట’ అంటూ హారర్ టచ్‌తో కూడిన డైలాగులు చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చనిపోయిన వ్యక్తి కసబ్ అని చెబుతూ.. సుధీర్ బాబు చేసిన కామెడీ.. తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఘోస్ట్ మీటర్‌ను అక్కడ పెట్టిన అనంతరం ‘కసబ్ గారూ.. మీరు ఇక్కడ ఉంటే, ఇందులో వన్ బ్లింక్’ అనగానే.. ఒక బ్లింక్ సౌండ్ వచ్చింది.
కసబ్.. ‘ఓజీ’ సినిమా చూశావా..
‘ఎలా ఉన్నారండి.. బాగున్నారండి’ అని ఇందులో ఒక బ్లింక్ అని అడిగారు. మరో బ్లింక్ మోగింది. ‘ఓజీ’ సినిమా (OG Movie) చూశారా? అని అడగగానే మరో బ్లింక్, నచ్చిందా? అనగానే మరో బ్లింక్.. ‘ఇంకో సినిమా వస్తుంది.. గ్లోబ్ ట్రోటర్.. చూస్తారు కదా’ అనగానే మరో బ్లింక్, ‘ఇంకేంటి సంగతులు.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూశారా?’ అని అనగానే మరో బ్లింక్.. ‘నచ్చిందా’ అనగానే ఆగకుండా బ్లింక్స్ వస్తూనే ఉన్నాయి. ‘సరదాగా.. జటాధర ట్రైలర్ చూస్తారా మీరు?’ అనగానే బ్లింక్.. ఇలా ఘోస్ట్ కాన్సెఫ్ట్‌తో సుధీర్ బాబు తన ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో చివరి ట్విస్ట్ మాత్రం అదిరింది. ‘జటాధర’ ట్రైలర్ విషయానికి వస్తే.. సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) చేతుల మీదుగా ‘జటాధర’ ట్రైలర్ అక్టోబర్ 17వ తేదీన విడుదలకాబోతోంది. ‘జటాధర’ ప్రమోషన్స్ నిమిత్తం సుధీర్ బాబు అనుసరించిన ఈ విభిన్న శైలి, ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ వెరైటీ ప్రమోషన్స్‌తో సుధీర్ బాబు టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టినట్టుగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
It is time for the DIVINE AWAKENING 🔱#JatadharaTrailer out tomorrow ❤🔥
Witness #Jatadhara in theatres from Nov 7th 2025 in Telugu & Hindi 🪔#JatadharaOnNov7th#UmeshKrBansal #PrernaArora @zeestudios_ @zeestudiossouth @zeemusiccompany @shivin7 @bhavinigoswami_ @ikussum pic.twitter.com/NsYSYoWufh
— Sudheer Babu (@isudheerbabu) October 16, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
