Daggubati Family: దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), దగ్గుబాటి రానా (Rana), నిర్మాత సురేశ్ బాబు (Suresh Babu), అభిరామ్ (Abhiram)లకు నాంపల్లి కోర్టు ఝలక్ ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా నవంబర్ 14న దగ్గుబాటి హీరోలు కోర్టుకు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు దగ్గుబాటి హీరోలు (Daggubati Heroes) కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. దక్కన్ కిచెన్ కూల్చివేత కేసుకు సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు దగ్గుబాటి హీరోలు.. విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు సీరియస్‌గా రియాక్టైంది. నవంబర్ 14న వారు.. కోర్టుకు హాజరు కావాలని ఈ హీరోల తరఫు లాయర్‌కు గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read- Dammu Srija: వాడు, వీడు అంటూ నాగ్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీజ.. వీడియో వైరల్!
అసలేం జరిగిందంటే..
నందకుమార్ అనే వ్యక్తికి చెందిన దక్కన్ కిచెన్ హోటల్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది, కొందరు బౌన్సర్లు కలిసి 2004, జనవరిలో పూర్తిగా కూల్చి వేసిన విషయం తెలిసిందే. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు పాల్పడ వద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. తన హోటల్‌ను కూల్చి వేశారని పేర్కొంటూ, న్యాయం జరిగేలా చూడాలని నందకుమార్ నాంపల్లిలోని 17వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, నిర్మాత దగ్గుబాటి సురేశ్, అభిరామ్‌లపై కేసులు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసులు రిజిష్టర్ చేశారు. కాగా, కోర్టులో 19 నెలలుగా విచారణ జరుగుతున్నా.. ఒక్కసారి కూడా నిందితులు హాజరు కాలేదు. క్రితంసారి విచారణ సందర్భంగా నిందితులు వ్యక్తిగతంగా రావాలని చెప్పినా.. గురువారం విచారణకు ఎవరూ హాజరు కాలేదు. దీంతో కోర్టు సీరియస్ అవుతూ.. నవంబర్ 14న మరోసారి విచారణ ఉంటుందని, దీనికి కంపల్సరీగా ఆ ఫ్యామిలీ హీరోలు హాజరుకావాలని ఆదేశించింది.
Also Read- Megastar Chiranjeevi: 70 ఏళ్ల వయసులో అవసరమా? అనే వాళ్లకి ఇదే సమాధానం!
గత ప్రభుత్వంలో..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అప్రూవర్‌గా మారలేదనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తనపై అక్రమ కేసులు నమోదు చేయించటంతో పాటు హోటల్‌ను కూల్చి వేయించారని నందకుమార్ ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ల సూచనల మేరకే ఇదంతా జరిగిందని చెప్పారు. దీంట్లో ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుల హస్తం ఉందని ఆరోపించారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో రాధాకిషన్ రావు దగ్గుబాటి బ్రదర్స్‌తో మీటింగ్ పెట్టి మరీ తనను వేధింపులకు గురి చేశారన్నారు. ఈ క్రమంలోనే తనపై అక్రమంగా 12 కేసులు బనాయించారని చెప్పారు. బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అయితే, తాను దేనికీ లొంగలేదని చెప్పారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే తనపై నమోదు చేసిన కేసుల్లో నుంచి బయటకు వచ్చానన్నారు. ఇప్పటికీ చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని చెబుతూ భయపడేది లేదని చెప్పారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
