Kavitha( IMAGE CREDIT; SWETCHA REPORTER)
Politics, లేటెస్ట్ న్యూస్

Kavitha: 25 నుంచి జాగృతి జనం బాట.. కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర!

Kavitha: ఈ నెల 25 నుంచి జాగృతి ఆధ్వర్యంలో జనం బాట యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. నిజామాబాద్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని వెల్లడించారు. సామాజిక తెలంగాణ ఒక నినాదం కాదు. అది మా విధాన పరమైన నిర్ణయమని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట’ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వారిచ్చే సలహాలు, సూచనల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. నాలుగు నెలల పాటు వారానికి నాలుగు రోజులు ప్రతి జిల్లాల్లో రెండు రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని, అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామన్నారు.

 Also Read: Kavitha Politics: కేసీఆర్ ఫొటో తీసేసిన కవిత!.. జాగృతి శ్రేణులకు కీలక సూచన

తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు

ప్రజలే గురువులన్నారు. పెద్ద పెద్ద నాయకులను ఓడించినా సామాన్యులను అందలమెక్కించిన అది ప్రజలతోనే సాధ్యమన్నారు. తాను తెలంగాణ సోయి, కన్ సర్న్ ను ఉన్న వ్యక్తినని అందుకే పేగులు తెగేదాక తెలంగాణ కోసం కొట్లడానని చెప్పారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరగాలన్నదే తన బలమైన ఆకాంక్ష అన్నారు. బీఆర్ఎస్ లో ఉండి కూడా తాను ఇదే విషయాన్ని చెప్పేదాన్ని అని, అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా సామాజిక తెలంగాణ సాధించేందుకే తాను జనం బాట పడుతున్నట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ ఫొటో లేకుండా జనం బాట యాత్ర నిర్వహిస్తున్నది నిజమేనని అయితే అది ఆయనను అగౌరవపరిచే చర్య ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ వచ్చేదికాదని, ఆయన ఉద్యమ నాయకుడని, అలాంటి వ్యక్తికి కూతురిగా పుట్టడం దృష్టమన్నారు.

సామాజిక తెలంగాణ కోసం మాట్లాడినందుకే తనను కుట్ర

కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని అలాంటప్పుడు ఆయన ఫొటోతో జనంలోకి వెళ్లడం నైతికంగా కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ జాగృతి మొదలు పెట్టినప్పుడు కేవలం జయశంకర్ ఫొటో మాత్రమే పెట్టమని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జాగృతి లో కేసీఆర్ ఫొటో పెట్టానన్నారు. కేసీఆర్ అనే చెట్టు నీడలో ఉన్నన్ని రోజులు ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడినందుకే తనను కుట్ర చేసి పార్టీ నుంచి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత చెట్టు పేరు చెప్పుకొని బతికే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. తన దారి వేరైనప్పుడు ఆ దారిలో ధైర్యంగా వెళ్లాల్సి ఉంటుందని, పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా కేసీఆర్ ఫొటో పెట్టుకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తుందని తెలిపారు.

జాగృతి ఉన్నంత వరకు అన్ని వర్గాలకు మేలు

తనకు ప్రజలే గురువులని స్పష్టం చేశారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నామని.. సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. సామాజిక తెలంగాణ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే కాదని ఓసీల్లో పేదలు, మహిళలు, యువత ఇలా అందరూ సామాజిక తెలంగాణలో భాగమన్నారు. అందరికీ రావాల్సిన హక్కులు వచ్చే వరకు తమ పోరాటం ఉంటుందన్నారు. జాగృతి ఉన్నంత వరకు అన్ని వర్గాలకు మేలు కోసం కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేస్తూనే ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. గ్రూప్ – 1 పరీక్ష, బీసీ రిజర్వేషన్లు, బకనచర్ల ప్రాజెక్టు ఆపాలని, ఏపీలో కలిపి 5 గ్రామాలు తెలంగాణలో కలిపే వరకు పోరాటాలు చేస్తామన్నారు. జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీ లు పూర్తి వైఫల్యం చెందాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఆ పార్టీ ప్రతిపక్షాలనే తిడుతూ కూర్చుందని విమర్శించారు. రాష్ట్రం మొత్తం అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో యూరియా నుంచి పట్టణాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని రాష్ట్రం మొత్తాన్ని సమస్యలు పట్టిపీడుస్తున్నాయన్నారు.

జాగృతిని బలోపేతం చేస్తాం

బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. బీసీ రిజర్వేషన్లను గవర్నర్, రాష్ట్రపతి వద్ద అమలు చేయించాల్సింది పోయి ప్రజలనే బెదిరించే విధంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. జాగృతిని బలోపేతం చేస్తామన్నారు. పాలవారిని కలుస్తాం. కొత్తవారిని చేర్చుకుంటాం అని వెల్లడించారు. పార్టీ వద్దు అనుకున్న తర్వాత ఎమ్మెల్సీ పదవి నాకు ఎందుకు అన్నారు. పార్టీ కంటే ఎమ్మెల్సీ చిన్నపదవి అన్నారు. ప్రభుత్వం నా రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదో తెలియదన్నారు. నాకు పదవిపై వ్యామోహం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చిన్న సమస్య అని, తెలంగాణ జాగృతికి సంబంధం లేదన్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, వివిధ విభాగాలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

యాత్ర రూట్ మ్యాప్

ఈ నెల 25న జాగృతి జనంబాట యాత్ర నిజామాబాద్ లో ప్రారంభం అవుతుంది. 26న సైతం కొనసాగుతుంది. మహబూబ్ నగర్ 28,29తేదీల్లో, కరీంనగర్ లో ఈ నెల 31, నవంబర్ 1న, ఆదిలాబాద్ లో 3, 4 తేదీల్లో, హన్మకొండ, వరంగల్ లో 8, 9 తేదీల్లో, నల్లగొండ 11, 12 తేదీల్లో, మెదక్ లో 14, 15 తేదీల్లో, ఖమ్మం 17, 18 తేదీల్లో, రంగారెడ్డిలో 20, 21 తేదీల్లో, నారాయణపేటలో 23, 24 తేదీల్లో, కామారెడ్డిలో 27, 28 తేదీల్లో, గద్వాలలో నవంబర్ 30, డిసెంబర్ 1, పెద్దపల్లిలో 3, 4 తేదీల్లో, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, 7 తేదీల్లో, భూపాలపల్లిలో 9,10 తేదీల్లో, మంచిర్యాలలో 12, 13 తేదీల్లో, సిద్దిపేటలో 15, 16 తేదీల్లో, కొత్తగూడెంలో 18,19 తేదీల్లో, మేడ్చల్ లో 21, 22 తేదీల్లో, నాగర్ కర్నూల్ జిల్లాలో 27,28 తేదీల్లో, సిరిసిల్లలో జనవరి 3,4 తేదీల్లో, సూర్యాపేటలో 6,7 తేదీల్లో, జనగాంలో 10,11 తేదీల్లో, ఆసిఫాబాద్ లో 17, 18 తేదీల్లో, సంగారెడ్డిలో 20, 21 తేదీల్లో, వికారాబాద్ లో 24, 25 తేదీల్లో, ములుగులో 27, 28 తేదీల్లో, జగిత్యాలలో 30, 31 తేదీల్లో, మహబూబాబాద్ లో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో, నిర్మల్ లో 5,6 తేదీల్లో, వనపర్తి జిల్లాలో 8,9 తేదీల్లో, హైదరాబాద్ లో 12,13 తేదీల్లో కొనసాగుతుంది. ఫిబ్రవరి 13న ఎల్బీనగర్ స్టేడియంలో ‘జాగృతి జనం బాట’ ముగింపు సభను నిర్వహించనున్నారు.

 Also ReadKavitha: టీజేవైఎఫ్ కొత్త జోరు.. 7 జిల్లాలకు కమిటీలు ప్రకటన కవిత

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?