Swetcha Effect, Transfer of 12 CCS inspectors
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Response To Article: స్వేచ్ఛ ఎఫెక్ట్‌, 12 మంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ

Swetcha Effect, Transfer of 12 CCS inspectors:హైదరాబాద్ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లో జరుగుతున్న అక్రమాలను ‘స్వేచ్ఛ’డైలీ ఇన్వెస్ట్ గేషన్ టీమ్ బయటకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ‘స్వేచ్ఛ డైలీ’ ఇచ్చిన వరుస కథనాలకు పోలీసు శాఖ స్సందించింది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా 12 మంది సీసీఎస్ ఇన్ స్పెక్టర్లను మల్టీ జోన్ 2 కు బదిలీ చేశారు. వీరంతా వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సీసీ ఉత్తర్వులు జారీ చేశారు.


కాగా బదిలీ వేటు పడినవారిలో శివగౌని శివశంకర్, రఘుబాబు కొలమల, మీసాల అప్పలనాయుడు, బూక్యా రాజేష్, సీతారాములు, హుస్సేన్ ధీరావత్, గుమ్మడిదల సత్యం, చీపుర్ల నాగేశ్వరరెడ్డి, ధరావత్ కృష్ణ, కొత్త సత్యన్నారాయణ, ఎస్ఏ ఇమ్యాన్యుయేల్, బిట్టు క్రాంతికుమార్ లు ఉన్నారు.మే 21న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమా మహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేయగా తాజాగా గురువారం రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సీసీఎస్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ ఉదంతంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సీసీఎస్ ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలను చేపట్టారు.

Also Read: ముంపు నీరు సంపులోకి


రూ.25 లక్షల నగదు కంటే ఎక్కువ సొత్తుతో ముడిపడిన నేరాలు , రూ.75 లక్షలు కంటే మించిన ఆర్థిక నేరాల విచారణను సీసీఎస్ చేపడుతోంది. ఏళ్ల తరబడిగా అక్కడ తిష్ట వేసి ఈ సంస్థను అవినీతికి అడ్డాగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇన్ స్పెక్టర్లపై ఎట్టకేలకు బదిలీ వేటు పడటానికి పరోక్షంగా కారణమైన స్వేచ్ఛ డైలీ కథనాలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం)

Just In

01

Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే

Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 54 వేల 685 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!