Mass Jathara vs Baahubali: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ జాతర ఇప్పటికే అనేక సార్లు విడుదల వాయిదా పడిన తర్వాత అక్టోబర్ 31 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే అదే రోజు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘హుబలి ది ఎపిక్’రానుంది. అయితే ఈ రెండు సినిమాలు ఓకే రోజున విడుదల కానుండటంతో ప్రేక్షకులు ఏం చూడాలా అని సందిగ్ధంలో ఉన్నారు. ఈ టైటానిక్ క్లాష్ వల్ల ‘మాస్ జాతర’కు ‘బాహుబలి ఎఫెక్ట్’ పడటం ఖాయమని ట్రేడ్ అనాలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, బాహుబలి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఎపిక్ విజువల్స్ లెగసీ కలెక్షన్లు రవితేజ సినిమాకు స్క్రీన్స్, ఆడియన్స్ షేర్‌లో దెబ్బ తీస్తాయి. రవితేజ కెరీర్‌లో ‘మాస్ జాతర’ చాలా కీలకమైన సినిమా. గత కొన్నేళ్లుగా అతనికి సాలిడ్ హిట్ లేకపోవడంతో, ఈ చిత్రం అతని కమ్‌బ్యాక్‌గా చూస్తున్నారు అభిమానులు. భాను భోగవరపు డైరెక్షన్‌లో రూపొందిన ఈ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రవితేజ మొదటిసారిగా రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అలాగే విధు అయ్యన్న కెమెరా వర్క్‌తో సినిమా మాస్ ఎలిమెంట్స్‌తో పూర్తి ప్రొవైడ్ అవుతుంది.
Read also-Pankaj Dheer: ఆ సమయంలో సర్వస్వం కోల్పోయిన పంకజ్ ధీర్ కుటుంబం.. ఎందుకంటే?
టీజర్ విడుదలై ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ ఊహించని పోటీ వల్ల రవితేజ అభిమానుల్లో కొంచెం అసంతృప్తి కనిపిస్తోంది. బాహుబలి రీ-రిలీజ్ గురించి చెప్పాలంటే, 2015లో విడుదలైన ఈ ఎపిక్ భారతీయ సినిమా చరిత్రలో మైలురాయి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కలు ప్రదాన పాత్రలు పోషించారు. రాజమౌళి విజన్ మామూలు కాదు VFXలతో ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లు పైగా వసూలు చేసింది. రీ-రిలీజ్‌తో మళ్లీ ఆ ఫీవర్ మేల్కొంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా. ఈ రీ-రిలీజ్ టార్గెట్ రూ.100 కోట్లు అని, దీని వల్ల ‘మాస్ జాతర’ కలెక్షన్లు 20-30% తగ్గవచ్చని అంచనా. ముఖ్యంగా హైబ్రిడ్ 2K, IMAX స్క్రీన్లలో బాహుబలికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. గతంలో ‘ధమాకా’ వంటి సినిమాలు రూ.100 కోట్లు దాటినప్పటికీ, ఈ క్లాష్ వల్ల రవితేజ టార్గెట్ రూ.50-60 కోట్లకు పరిమితమవుతుందా అని ప్రశ్నలు లేవుతున్నాయి.
Read also-Jatadhara: ‘జటాధర’ డ్యాన్స్ నంబర్ అదరహో.. గ్లామర్ ట్రీట్ అదిరింది!
ఈ ఎఫెక్ట్ ఎందుకు పడుతుందంటే, బాహుబలి పాన్-ఇండియా ఫెనామినా. దక్షిణాది, హిందీ, తమిళం, తెలుగు మార్కెట్లలో దాని గ్రిప్ ఇంకా బలంగా ఉంది. రీ-రిలీజ్‌తో పాత ప్రేక్షకులు, కొత్త జనరేషన్ కలిసి థియేటర్లకు రావచ్చు. మరోవైపు ‘మాస్ జాతర’ రవితేజ మాస్ ఇమేజ్‌ను రీలైవ్ చేస్తుందని ఆశ. అయితే, ఈ క్లాష్ వల్ల ప్రమోషన్లు, స్క్రీన్ షేర్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ట్రేడ్ ఎక్స్‌పర్టులు చెబుతున్నట్లు, బాహుబలి రీ-రిలీజ్‌లో ఎక్కువ వసూళ్లు సాధించే ఛాన్స్ ఉంది. దీని ప్రభావం రవితేజ సినిమాపై పడవచ్చు. కానీ, రవితేజ అభిమానులు వదలరు! మాస్ మహారాజా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ‘మాస్ జాతర’ బాహుబలి షాడో నుంచి బయటపడి హిట్ కొట్టే అవకాశం ఉంది. ఈ క్లాష్ తెలుగు సినిమా ట్రేడ్‌కు ఎపిక్ బ్యాటిల్‌గా మారనుంది. రవితేజ ఈ ఛాలెంజ్‌ను ఎదుర్కొని విజయవంతమవుతాడా? అన్నది అక్టోబర్ 31న తెలుస్తుంది! సింగిల్ స్క్రీన్లు మాత్రం మాస్ జాతర చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మాస్ మొత్తం అక్కడే ఉంటుంది కనుక బాహుబలి ది ఎపిక్ సినిమాను ఎక్కువగా ఇంటి దగ్గర చూడటానికి అభిమానులు ఇష్టపడవచ్చు.
