Priyadarshi (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Priyadarshi: ‘మిత్ర మండలి’పై నెగెటివ్ క్యాంపైన్.. ప్రియదర్శి ఎలా స్పందించారంటే?

Priyadarshi: ‘మిత్ర మండలి’ (Mithra Mandali) సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారంటూ నిర్మాత బన్నీ వాసు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ కామెంట్స్ తర్వాతే సినిమా గురించి పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఇది చూసిన వారంతా.. ప్రీ ప్లాన్డ్ అని అనుకుంటూ ఉండటం విశేషం. తాజాగా ఈ నెగిటివ్ క్యాంపైన్‌పై ఈ చిత్ర హీరో ప్రియదర్శి (Priyadarshi) కూడా మాట్లాడారు. బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మాతలు. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం (Niharika NM) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ప్రియదర్శి మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.

Also Read- Tollywood Heroines: బాలీవుడ్ అంటూ.. ఈ హీరోయిన్స్ తప్పు చేస్తున్నారా?

అనుదీప్ కథ కాపీ కొట్టాడా..

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనుదీప్, విజయ్, ఆదిత్య హాసన్, కళ్యాణ్ శంకర్ ఇలా అందరూ రూమ్ మేట్స్. ఈ సినిమా కథ విషయంలో ఎవరి ప్రభావం ఎవరి మీద పడిందన్నది చెప్పడం కష్టం. వీళ్లకున్న పిచ్చే వాళ్లను కలిపిందని నేను అనుకుంటున్నాను. విజయేందర్ చెప్పిన కథ వింటే.. అనుదీప్ కథను కాపీ కొట్టాడా? అని ఫస్ట్ నాకు అనిపించింది. కానీ, ప్రతీ ఒక్క విషయాన్ని ఎంతో వివరంగా చెప్పాడు. అప్పుడనిపించింది, ఇది విజయేందర్ సొంత కథే అని. బన్నీ వాస్ మిత్రమండలి, విజయేందర్ మిత్రమండలి, ఆర్టిస్టుల మిత్రమండలి, టెక్నీషియన్స్ మిత్రమండలి ఇలా అందరం కలిసి ఈ మూవీని హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రెడీ చేశాం. అనుదీప్ ఆ టైమ్‌లో ‘జాతి రత్నాలు’ స్టోరీ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు బాగా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్‌గా చెప్పడం బాగుంటుంది. ఇందులో కుల వ్యవస్థపై విజయేందర్ మంచి సెటైరికల్‌ సీన్లు రాశారు. కాకపోతే.. సినిమాల్లో ఇచ్చే సందేశాల ద్వారా సమాజం మారుతుందంటే.. అది నేను నమ్మను.

Also Read- Dammu Srija: వాడు, వీడు అంటూ నాగ్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీజ.. వీడియో వైరల్!

టార్గెటెడ్‌గా హేట్‌ను వ్యాప్తి చేస్తున్నారు

సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్లు, క్రింజ్ గురించి చెప్పాలంటే.. అవతలి వాళ్లని నవ్వించే ప్రయత్నం తప్పు కాదు. కానీ, అవతలి వాళ్లని తక్కువ చేసి కామెడీ చేయాలని చూడటమే నా దృష్టిలో క్రింజ్. కొన్ని సార్లు వాదనలు గెలవలేనప్పుడు, అలాగే మనల్ని ఏమీ చేయలేకపోతోన్నప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్లను చేస్తుంటారు. కొన్ని కొందరికి వర్కౌట్ అవుతాయి.. ఇంకొన్ని కొందరికి వర్కౌట్ కావు. ‘మిత్ర మండలి’ సినిమాపై నెగిటివ్ క్యాంపైన్ విషయంలో నేను ఒక్కటే చెబుతాను. సమాజంలో విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కాకపోతే.. అది నిర్మాణాత్మకమైన విమర్శ అయితే చాలా బాగుంటుంది. కానీ కావాలనే ద్వేషాన్ని ప్రదర్శిస్తుండటం నేనూ గమనించాను. కించ పర్చాలని, కిందకు తొక్కాలని కావాలని టార్గెటెడ్‌గా హేట్‌ను వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి ద్వేషాన్ని వ్యాప్తి చేసే వాళ్ల కోసం.. ఇందులోని నలుగురు నటులం ఓ ఫన్నీ వీడియోని చేశాం. అలా టార్గెటెడ్ హేట్రెడ్‌ని స్ప్రెడ్ చేసే వాళ్లు.. సోషల్ మీడియాలో కనీసం సొంత పేరు కూడా పెట్టుకోరు. ఏవేవో పేర్లతో, ఫేక్ ఐడీలతో, మనీ కోసం ఇలాంటి పనులను చేసే వారిని, చేయించే వారిని మనం ఏం చేయగలం..’’ అని ప్రియదర్శి చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!