విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్స్
Ex Minister Jagadish Reddy fires on power purchase issue:
మా హయాంలో నియమించబడ్డ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని విచారణ కమిటీ వేశారు. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా నష్టం జరగలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశంలో జవాబుదారిగా సమాధానం ఇచ్చాం. కమిషన్ పాత్ర పైన స్పష్టమైన సమాధానం కెసిఆర్ లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. శాసన సభ సమావేశాల్లో విద్యుత్ కొనుగోలు పై క్లియర్ గా వివరణ ఇచ్చాం. ఇదేం జ్యుడిషియల్ విచారణ కాదు, అయినా జ్యుడిషియల్ విచారణల చేస్తున్నారు. వాదనలు వినకుండానే తీర్పును ఇచ్చేలా జస్టిస్ వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పారు. తెలంగాణ పైన కెసిఆర్ పైన జస్టిస్ నరసింహారెడ్డి గతంలో ప్రేమ ఉండేది .న్యాయం వెైపు జస్టిస్ నరసింహారెడ్డి నిలబడడం లేదు. అందుకు కమిషన్ నుండీ తప్పుకుంటే మంచిది అని మాజీ మంత్రి సూచన చేశారు.
అప్పడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు?
గతంలో ఇప్పటి ప్రభుత్వ పెద్దలు అభ్యంతరాలు తెలిపారని గుర్తు చేశారు. ఆనాడు వారి సందేహాలు తీర్చి ముందుకెళ్లామన్నారు. గతంలో అంగీకరించి ఇప్పుడు అభ్యంతరాలేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సరిగ్గా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. విచారణ జరపకముందే తీర్పు ఇచ్చినట్లు కమిషన్ వ్యవహరించిందని సీరియస్ అయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డిపై తమకు గౌరవం ఉందన్నారు. చీకట్లలో ఉన్న తెలంగాణలో కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. కాంగ్రెస్, బీజేపీకి అనుకూలంగా కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏ కమిషన్ కూడా విచారణ పూర్తికాకుండా తమ అభిప్రాయాలు చెప్పదన్నారు. కమిషన్‌ను, విచారణను తాము వ్యతిరేకించడం లేదన్నారు. గతంలో కమిషన్లు వేసినప్పుడు అడ్డుకున్న ఘటనలున్నాయన్నారు.