Telangana Protest: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇలాకాలోని గిరిజన కార్మికుల ఆకలి పోరాటం 34రోజులుగా కొనసాగుతుంది. ఎండనక వాననక ఆడ మగ తేడా లేకుండా రోడ్డుపైనే వంటావార్పు చేసి చలిలోనే నిద్రిస్తూ 72 గంటలుగా ధర్నా చేస్తున్న పక్కనే ఉన్న గిరిజన శాఖ సంక్షేమ మంత్రికి గిరిజన కార్మికుల ఆకలి కేకలు వినిపించడం లేదు. చదువుకోవాల్సిన చిన్నారి చేతులు పోయిల దగ్గర మగ్గిపోతున్న పాఠాలు చెప్పాల్సిన పంతులు వంట పాత్రను శుభ్రం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు కరుణించడం లేదు కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పెద్దలు 33 రోజులగా ఆశ్రమ హాస్టల్ డైలీ వెజ్ కార్మికుల పోరాటం వైపు తొంగి చూడకపోగా మాకేం పట్టినట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ కార్మికులు చేస్తున్న పోరాటం అంతకంతకు ఉధృతం అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఏ రాష్ట్ర చరిత్ర చూసిన కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలు అవకాశం ఉంటే జీతాలు పెంచుతాయి లేకపోతే యధావిధిగా కొనసాగిస్తాయి.
Also Read: Bhadrachalam: భద్రాచలం ఎమ్మెల్యే పిఏ నవాబ్ ఆగడాలు.. రూ.3.60 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
ఆర్థిక శాఖ మంత్రి సొంత జిల్లాలోని కార్మికులు ఆకలి పోరాటం
అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో మార్పు తెస్తామని ప్రగంబలు పలికి అధికారానికి ఎక్కిన కాంగ్రెస్ పాలకులు మాత్రం దీనికి విరుద్ధంగా దొంగ జీవోలను తీసుకువచ్చి అప్పటివరకు ఇస్తున్న జీతాలను తగ్గించి విద్యార్థులకు అన్నం వండి పెట్టే కార్మికులను పస్తులించే పరిస్థితికి తీసుకువస్తే జీతాలు పెంచక పోయినా పర్లేదు పర్వాలేదు పాత జీతాలు అయిన కొనసాగించండి మహాప్రభో అంటూ సమ్మె బాట పట్టిన కార్మికులు వర్షాన్ని చలిని సైతం లెక్కచేయకుండా 72 గంటల ధర్నా విజయవంతం చేశారు. 72 గంటల ధర్నాలో భాగంగా సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి సొంత జిల్లాలోని కార్మికులు ఆకలి పోరాటం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
చరిత్రలో ఎన్నడు లేని విధంగా 72 గంటల మహాధర్నా
పక్కనే ఉన్న ములుగు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ఆదివాసి మహిళల ఆకలి బాధలు కనిపించకపోవడం అని అన్నారు. 34 రోజుల సమ్మెతో పాటు చరిత్రలో ఎన్నడు లేని విధంగా 72 గంటల మహాధర్నా సైతం కార్మికుల ఐక్యంగా విజయవంతం చేశారని ఈ ధర్నాతోనైనా ప్రభుత్వ పెద్దలు దిగి రాకపోతే కలిసివచ్చే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గిరిజన కార్మికులే కదా ఏం చేస్తారులే అని ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి కండగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రజాసంఘాల నాయకులు ఆ ప్రజాప్రతితులను ఊర్లో కూడా తిరగనీయకుండా అడ్డుకుంటామని ఏజే రమేష్ స్పష్టం చేశారు.
కార్మిక పోరాటానికి పెరుగుతున్న ప్రజాసంఘాల మద్దతు
సమ్మెకు 72 గంటల ధర్నాకు టీఎన్జీవో సంఘం భద్రాచలం శాఖ సంపూర్ణ మద్దతును ప్రకటించింది టీఎన్జీవో డివిజన్ అధ్యక్షులు డెక్క నరసింహారావు కార్యదర్శి బాలకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు ఐటీడీఏ వద్ద సమ్మెకు మద్దతు పలికారు వేతనాలు తగ్గించటం చట్ట వ్యతిరేకమని దేశ చరిత్రలో ఇటువంటి దుర్మార్గం ఎప్పుడు జరగలేదని పేర్కొన్నారు ఏ ప్రభుత్వమైనా జీతం పెంచుతుంది గాని తగ్గించడం ఏమిటని విమర్శించారు హాస్టల్ వర్కర్ల మ్మెకు తాము అండగా ఉంటామని టీఎన్జీవో నేతల ప్రకటించారు. 72 గంటల మహా ధర్నాను చేపట్టిన గిరిజన కార్మికులకు వివిధ ప్రజా సంఘాల మద్దతు అంతకంతకు పెరుగుతుంది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా పట్టణ నాయకులు గిరిజన కార్మికులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఐదువ జిల్లా అధ్యక్షురాలు డి సీత లక్ష్మి మాట్లాడుతూ గిరిజన మహిళా కార్మికులు 33 రోజులుగా సమ్మె చేస్తున్న జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్పందించకపోవడం దుర్మార్గమని కార్మికులకు అండగా ఐద్వా నిలుస్తుందని తెలిపారు.
విద్యార్థుల చదువులపై ప్రభుత్వం పెద్దలకు పట్టింపు లేదా?
అనంతరం భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సమ్మెకు పూర్తి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి ఎర్రం శెట్టి వెంకట రామారావు మాట్లాడుతూ డైలీ వెజ్ కార్మికుల తో కలిసి భవన నిర్మాణ కార్మికుల సైతం ప్రత్యక్ష ఉద్యమంలోకి వస్తామని హామీ ఇచ్చారు. 33 రోజులగా కార్మికుల సమ్మెలో ఉంటే విద్యార్థుల చదువులపై ప్రభుత్వం పెద్దలకు పట్టింపు లేదా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు పోటీలు పడిప్రచారం చేసుకుంటున్నారే తప్ప గిరిజన కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఏమాత్రం ముందుకు రావడం లేదని అన్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు దిగి రాకపోతే ఇతర సంఘాల మద్దతుతో ప్రజాప్రతినిధుల ఇండ్లను సైతం సీఐటీయూ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు.
సోయం జోగారావు ఆధ్వర్యంలో నాయకత్వం మద్దతు
సమ్మెకు ఎల్ఐసి ఏఓఐ మద్దతు ప్రకటించింది ఏవోయి జాతీయ కోశాధికారి ఆర్కే చారి బ్రాంచ్ కార్యదర్శి సోయం జోగారావు ఆధ్వర్యంలో నాయకత్వం మద్దతు ప్రకటించారు గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సమ్మెకు మద్దతు ప్రకటించింది యూనియన్ కార్యదర్శి రమా ఆధ్వర్యంలో కమిటీ సభ్యులంతా పోరాటానికి అండగా ప్రకటించారు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున శివప్రశాంత్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ జిల్లా కార్యదర్శి వరక అజిత్ మద్దతు తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు మూడు రోజులపాటు సమ్మెలోనే ఉంటూ కార్మికులకు అండగా నిలిచారు కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సిఐటియు నాయకులు నాగేశ్వరరావు హీరాలాల్ గిరి ఈశ్వర్ మంగి లాల్ జలంధర్ జయ కౌసల్య రామ కల మోహన్ అనంతరాములు నరసింహారావు వెంకటేశ్వర్లు పండ మంగమ్మ అజిత తదితరులతోపాటు వందలాది మంది హాస్టల్ వర్కర్లు పాల్గొన్నారు.
Also Read: Bhadrachalam Tragedy: భద్రాచలంలో ఘోరం.. ఆరుగురు కూలీలు స్పాట్ డెడ్
