Dammu Srija: గత వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిలో శ్రీజ (Srija) ఒకరు. కామనర్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన శ్రీజ, తన నోటితోనే దాదాపు 5 వారాల పాటు నెట్టుకుంటూ వచ్చింది. ఆమె నస భరించలేకపోయిన వీక్షకులు, గత వారం ఎలిమినేషన్స్‌లో ఆమెను ఇంటికి పంపించారు. కానీ, కొందరు ఆమె ఇంటిలో ఉండాల్సిందే అంటూ బిగ్ బాస్‌పై ప్రెజర్ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ ప్రెజర్‌తో మళ్లీ ఆమెను ఇంటిలోకి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ఆమెను ఎలా? మళ్లీ హౌస్‌లోకి పంపిస్తారు. అసలు ఈ వీడియో చూశారా? అంటూ నెటిజన్లు కొందరు ఓ వీడియో బాగా వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో బిగ్ బాస్ హోస్ట్, కింగ్ నాగార్జున ఫ్యామిలీ (Akkineni Nagarjuna Family)ని టార్గెట్ చేస్తూ.. వాడు, వీడు అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత (Sobhita), సమంత (Samantha)లను ఉద్దేశించి ఆమె మాట్లాడుతున్న ఈ వీడియో.. ఓల్డ్‌ది అని తెలుస్తున్నా.. మరీ దారుణంగా ఇందులో శ్రీజ మాట్లాడుతుంది. అసలీ వీడియోలో శ్రీజ ఏమందంటే..
Also Read- Balasaraswathi Devi: తొలి తరం గాయని రావు బాల సరస్వతి దేవి కన్నుమూత.. పవన్ కళ్యాణ్ సంతాపం
భర్త చీట్ చేశాడు.. భార్య భరణం కోసమే విడాకులు
‘‘వాడు ఎక్స్ వైఫ్‌తో కలిసి పెంచుకున్న కుక్క ఫొటోయో పోస్ట్ చేశాడా? వాడు ప్రజంట్ వైఫ్‌తోనే పోస్ట్ చేశాడా? అనేది మీకు అవసరం లేదు, నాకూ అవసరం లేదు. అది నాకు తెలుసు. కానీ దీనిపై నేను మాట్లాడతా. టాలీవుడ్ ఫేమస్ కపుల్.. 10 సంవత్సరాల రిలేషన్, 4 సంవత్సరాల మ్యారేజ్.. బాగానే ఉండేవారు. సడెన్‌గా ఒకరోజు ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకోబోతున్నామని పోస్ట్ పెట్టారు. ఇద్దరూ సెలబ్రిటీసే కాబట్టి, చాలానే ఆరోపణలు వచ్చాయి. భర్త చీట్ చేశాడు.. భార్య భరణం కోసమే విడాకులు తీసుకుంది.. ఇలా చాలానే రూమర్స్ వచ్చాయి. తర్వాత రెండు సంవత్సరాలు గడిచాయి. ఎవరిదారి వారు చూసుకున్నారు. సడెన్‌గా ఒకరోజు.. ఎవరితో అయితే భర్త చీట్ చేశాడని అన్నారో.. తననే పెళ్లి చేసుకోవడం జరిగింది. లైఫ్ లాంగ్ సింగిల్‌గా ఉండిపోవాలా? ఏంటి? కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. రేపు ఎక్స్ వైఫ్ బర్త్‌డే. ముందు రోజు తన ఎక్స్ వైఫ్ నిర్మించిన సినిమా ట్రైలర్ రిలీజ్ చేసుకుంది. సడెన్‌గా ఆ భర్త.. తన ఎక్స్ వైఫ్ సక్సెస్ చూడలేకపోయాడో.., జలసీ తెప్పించాలని అనుకున్నాడో, లేదంటే హర్ట్ చేయాలనుకున్నాడో తెలియదు కానీ.. వాళ్ల ఎక్స్ వైఫ్‌తో కలిపి కో-పేరేంటింగ్ చేస్తున్న ఒక కుక్కపిల్ల ఫొటో పోస్ట్ చేశాడు. ఆ కుక్క ఫొటోతో పాటు, వాళ్ల ప్రజంట్ వైఫ్‌తో కలిసి పడుకున్న ఫొటో పెట్టాడన్నమాట.
Also Read- Ilaiyaraaja: ఇళయరాజా స్టూడియోలో బాంబు.. మరోసారి తమిళనాడులో బాంబు బెదిరింపుల కలకలం!
నేనంత మంచిగా ఆలోచించను
నెగిటివ్‌గానే థింక్ చేస్తావా? నీకేం పని లేదా? అంటే.. నేనంత మంచిగా ఆలోచించేదాన్ని మాత్రం కాదనే చెబుతా. మొన్న మొన్న పెళ్లి చేసుకుని, ఇన్ని రోజులూ ఎలాంటి పోస్ట్ చేయకుండా, సడెన్‌గా రేపు బర్త్‌డే.. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే పెట్టాడంటే.. ఎక్కడో ఒక దగ్గర హర్ట్ చేయాలని కాదా? సంవత్సరం అంతా పెట్టుకోవచ్చు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత సేమ్ తన బర్త్‌డే రోజు పెట్టినా సరే.. ఎవరూ అంత పట్టించుకునే వారు కాదు. కానీ, రీసెంట్‌గా పెళ్లయింది.. రేపు బర్త్ డే అనగా ఈ రోజు పోస్ట్ చేశారంటే.. వెరీ లో.. ఎర్త్ లెవల్ లో..’’ అని శ్రీజ ఈ వీడియోలో కామెంట్స్ చేసింది. ఆమె ఇందులో పేర్లు చెప్పకపోయినా, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందనేది.. ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా, అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటిదాన్ని బిగ్ బాస్ వరకు ఎలా రానిచ్చారు? నాగార్జున గారు.. ఇలాంటి వాళ్లని ఎంత దూరం పెడితే అంత మంచిది.. అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
Video of #Srija attacking Naga Chaitanya & Shobitha @iamnagarjuna @StarMaa please don’t bring back her. She is attacking personal lives and passing judgments.
Calling Naga Chaitanya Vadu ..No Respect nothung
✅️😷#BiggBossTelugu9 #BiggBoss9Telugu— Sreekar (@Sree4you) October 15, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

