gopi-galla-gova-trip( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Gopi Gall Goa Trip: అలా అనుకుని గోవా ట్రిప్‌కి వెళితే.. అక్కడ మాత్రం..

Gopi Gall Goa Trip: కొత్త సినిమాలను ఎప్పుడూ ఆదరించే తెలుగువారు ముందుకు మరో క్రేజే ప్రాజెక్ట్‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ రాబోతుంది. రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’. ఈ మూవీలో అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం వంటి వారు నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మించిన ఈ సినిమాను రోహిత్ అండ్ శశి తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు సాయి రాజేష్, వెంకటేష్ మహా, రూపక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Read also-Daksha OTT release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న మంచు లక్ష్మీ ‘దక్ష’ సినిమా.. ఎక్కడంటే?

సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘రోహిత్, శశి చాలా మంచి ఫిల్మ్ మేకర్స్. వాళ్లు సినిమాను తీసిన తీరు చూసి నాకు మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. ఈ చిత్రానికి ఎలాంటి సహాయమైనా సరే చేసేందుకు నేను ముందుంటాను. ఇలాంటి మూవీని మీడియా కచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ చిత్రాలను అందరూ ఎంకరేజ్ చేయాలి. ఎప్పటికైనా సరే రోహిత్ అండ్ శశి పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది’ అని అన్నారు. వెంకటేష్ మహా మాట్లాడుతూ .. ‘రోహిత్ అండ్ శశి నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. నేను వాళ్లని మొదటి సారి గోవాలోనే కలిశాను. ఈ టైటిల్ విన్న తరువాత నాకు ఆ రోజులే గుర్తుకు వచ్చాయి. కంచెరపాలెం మూవీని గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించేందుకు అక్కడికి వెళ్లాను. అప్పుడే వీళ్లని కలిశాను. అలా సరదాగా షార్ట్ ఫిల్మ్స్ తీస్తుండేవారు. ‘శేష్ మహల్’, ‘నిరుద్యోగ నటులు’, ‘డబుల్ ఇంజన్’ నాకు చాలా ఇష్టం.’ అని అన్నారు.

జగదీష్ భండారి మాట్లాడుతూ .. ‘‘శశి వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ చిత్రంలో నా మేనల్లుడు నటించాడు.’ అని అన్నారు.దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ .. ‘‘ఇదొక క్రేజీ చిత్రం. ఇది మ్యాజికల్ హ్యాంగవుట్ సినిమాలా ఉంటుంది. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. నిర్మాత సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన దర్శకులు సాయి రాజేష్, వెంకటేష్ మహా, రూపక్‌లకు థాంక్స్. రోహిత్, శశి మేకింగ్, స్టోరీ టెల్లింగ్ నచ్చి ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చాను. ఇదొక మంచి అనుభూతినిచ్చే చిత్రం అవుతుంది. ఈ మూవీని చూస్తే గోవాకి వెళ్లి వచ్చినట్టుగా ఉంటుంది. తెలుగు వాళ్లకి ఇదొక కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే చిత్రం అవుతుంది.’ అని అన్నారు.

Read also-Tollywood controversies: టాలీవుడ్‌లో సినిమా విడుదలకు ముందు కాంట్రవర్సీలు ఎందుకు?.. ఇదంతా పబ్లిసిటీ కోసమా..

డైరెక్టర్ శశి మాట్లాడుతూ .. ‘ఇది మాకు మూడో సినిమా. మూడు సిరీస్‌లని కూడా తీశాం. రోహిత్‌కి, నాకు స్టేజ్ మీద మాట్లాడటం మొహమాటం. మాకు షార్ట్ ఫిల్మ్స్‌లు తీయడం అలవాటు. కానీ మాకు మార్కెటింగ్‌లు చేయడం తెలీదు. మేం అడిగిన వెంటనే వచ్చిన రాజేష్, మహా, రూపక్‌లకు థాంక్స్. ‘హృదయకాలేయం’, ‘కేరాఫ్ కంచెరపాలెం’ వంటి సినిమాలు నన్నెంతో ఇన్ స్పైర్ చేశాయి. రూపక్ చేసిన ‘పరేషాన్’ నాకు చాలా ఇష్టం. ఇదొక రోడ్ ట్రావెల్ ఫిల్మ్. నిర్మాత సాయి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. మాలాంటి కొత్తవాళ్లని, చిన్న చిత్రాల్ని మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు రూపక్ మాట్లాడుతూ .. ‘రోహిత్, శశి నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. వీళ్లిద్దరూ చాలా సింపుల్‌గా సినిమాలు తీసేస్తుంటారు. వీళ్లకు తోడుగా నిలిచిన సాయికి థాంక్స్. అందరి సపోర్ట్‌తో ఈ మూవీ మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి.. ‘ఇది చాలా క్రేజీ ఫిల్మ్. మేం ఏ విషయంలోనూ ఎక్కువగా ప్రిపేర్ అవ్వకుండానే ఆన్ సెట్‌లో చేసేశాం. కథ, విజువల్స్ పట్టి నా మ్యూజిక్ వచ్చింది. సినిమా బాగా వచ్చింది. మా మూవీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!