Uttam Kumar Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

Uttam Kumar Reddy: ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం చేయడమే మా లక్ష్యం: మంత్రి ఉత్తమ్ కుమార్

Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్ పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖమంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణాను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. వాదుల ఎత్తిపోతల పథకం పురోగతి పై మంగళవారం సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ నిర్ణీత కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. పాలనాపరమైన అడ్డంకులను సత్వరం తొలగించి పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మూడు దశలలో పనులు..

జయశంకర్ భూపాల్ పల్లి(Jayashankar Bhopal Pally) జిల్లా గంగారాం(Gangaram) గ్రామ సమీపంలోని గోదావరి నది నుంచి 38.16 టి.యం.సి ల నీటిని వరంగల్(warangal), హనుమకొండ(hanunakonda),కరీంనగర్(Karimnagar), జయశంకర్ భుపాలపల్లి, ములుగు(Mulugu), జనగామ(Janagama), భోనగిరి యాదాద్రి(Bhonagiri Yadadri), సూర్యాపేట(Suryapet), సిద్దిపేట(Sidhipeta) జిల్లాలలో 5.57 లక్షల ఏకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు తెలిపారు. పంప్ హౌస్ లు, కాలువల తవ్వకాలు,నీటి సరఫరా తదితర పనులు పూర్తి చేసేందుకు మూడు దశలలో పనులు జరుగుతున్నాయన్నారు.5.56 లక్షల ఎకరాలను సాగు లోకి తేవడానికి ఉద్దేశించ బడిన ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 3.17 లక్షల ఏకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు. భూగర్భజలాలతో సాగులో ఉన్న 58,028 ఎకరాల విస్తీర్ణంతో కలుపు కుంటే ఆయకట్టు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

2,430 కిలోమీటర్ల కాలువ..

సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి 18,500 కోట్లు కాగా ఇప్పటి వరకు 14,269,63 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. మిగిలిన పనుల పూర్తికి 4,230 కోట్లు అవసరమౌతాయని తెలిపారు. ఖర్చు చేసిన మొత్తంలో నిర్మాణానికి 11,667.85 కోట్లు ఖర్చు చేయగా భూసేకరణ నిమిత్తం 1,343.06 కోట్లు ఖర్చు చేశామన్నారు. హైడ్రో-మెకానికల్-విద్యుత్ అవసరాల నిమిత్తం 1,170.63 కోట్లు ఖర్చుచేశామని, 2,430 కిలోమీటర్ల కాలువ తవ్వల్సి ఉండగా 1,663.10 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తి అయ్యాయని తెలిపారు. 702.62 కిలోమీటర్ల పైపు లైన్ కు ఇప్పటికి 669.66 కిలోమీటర్ల మేర పూర్తి చేశారని కాలువల లైనింగ్ కుడా799.80 కిలో మీటర్లు పూర్తి అయ్యిందని వెల్లడించారు. 46 ట్యాంక్ లకు 39 పూర్తి కాగా 21 పంప్ హౌజ్ లలో 18 ట్యాన్క్ లు పురోగతిలో ఉన్నాయన్నారు. అధికారికంగా అందించిన గగణాంకాల ఆధారంగా వివిధ విభాగాలలో 67% నుండి 95% మేర పనులు పురోగతి లో ఉన్నాయని తెలిపారు.

Also Read: Ind Vs WI: ఐదవ రోజుకు చేరిన రెండో టెస్ట్.. భారత్ గెలుపునకు సమీకరణం ఏంటంటే?

2.39 లక్షల ఎకరాలకు నీరు..

ప్రాజెక్టు మొదటి దశలో సాలీన 170 రోజుల పాటు 5.18 టీఎంసీ ల నీటిని పంపిణీ చేయగా 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుందన్నారు. రెండో దశలో 7.25 టీఎంసీ ల నీటితో మరో 1.83 లక్షల ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. కొత్తగా పంప్ హౌజ్ లు, సొరంగాలు, రిజర్వాయర్ ల నిర్మాణాల ద్వారా 25.75 టీఎంసీ ల నీటిని 2.39 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు మూడవ దశలో పనులు నడుస్తున్నాయన్నారు. 8 ప్యాకేజ్ లుగా విభజన చేసి పనులు మొదలు పెట్టగా ప్యాకేజ్-1,ప్యాకేజ్ఞానజ్-2 పూర్తి అయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. నిరంతర పురోగతిని నిర్ధారించడానికి కాంట్రాక్టర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించారు.

మెట్ట ప్రాంతాలలో..

​ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ, కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మరో రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు(Devadala Project)ను పూర్తి స్థాయిలో అమలులోకి తెస్తుందని, తద్వారా సుమారు ఆరు లక్షల ఎకరాలకు నమ్మకమైన సాగునీరు అందిస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థిరమైన ఆయకట్టును స్థిరీకరించి, పంట ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, ఉత్తర-మధ్య తెలంగాణ(Telangana)లోని మెట్ట ప్రాంతాలలో తాగునీటి లభ్యతను పెంచుతుందని వెల్లడించారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయి పొలాలలోకి నీరు ప్రవహించేలా చేయాలన్నారు, రాష్ట్రవ్యాప్తంగా సమాన సాగునీటి అభివృద్ధి, స్థిరమైన నీటి వినియోగంపై తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రి సీతక్క(Min Seethakka), ఎంపీ బలరాం నాయక్(MP Balaram Nayak), ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్విని రెడ్డి, సత్యనారాయణ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారుడు ఆదిత్య నాధ్ దాస్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, రమేష్ బాబు, శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.

Also Read; Konda Surekha: నాగార్జున వివాదంతో బాధపడ్డా.. మీడియాతో ఓపెన్‌గా ఉండట్లేదు.. మంత్రి కొండా సురేఖ

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!