Telangana Cabinet: కొత్త మంత్రులపై సీనియర్లు ప్రెజర్ పెడుతున్నట్లు తెలిసింది. వివిధ వర్క్స్ తో పాటు కార్యాలయ సిబ్బంది నియామకాల్లోనూ సిఫారసులు చేయడం గమనార్హం. తాజాగా రాష్ట్రంలోని ఓ సీనియర్ మంత్రి.. మరో కొత్త మంత్రి పేషీలోని ఓ ఎస్టీ నియామకానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. కచ్చితంగా నియమించుకోవాలని కోరినట్లు తెలిసింది. అంతేగాక ప్రత్యేకంగా లేఖ కూడా ఇచ్చినట్లు సమాచారం. అప్పటి వరకు తనకు తెలిసిన అధికారిని నియమించుకోవాలని భావించిన సదరు కొత్త మంత్రి.. సీనియర్ మంత్రి నుంచి రికమండేషన్ రావడంతో చేసేదేమీ లేక ఆ వ్యక్తిని రెండు రోజుల క్రితమే ఓఎస్డీ(OSD)గా నియమించుకున్నారు.
మూడు నెలల క్రితమే బాధ్యతలు
పైగా ఓఎస్టీగా నియామకమైన సదరు వ్యక్తి బీఆర్ ఎస్(BRS) పాలనలోనూ కీలక పాత్ర వహించి నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో తన పేషీలోనూ తనకు స్వేచ్ఛ లభించకపోతే ఎలా? అని కొత్త మంత్రి తన సన్నిహితుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. మూడు నెలల క్రితమే బాధ్యతలు తీసుకున్న ఆ మంత్రి ఇప్పుడిప్పుడే త న శాఖలను సమన్వయం చేస్తూ పరిపాలన పరంగా ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు వ్యవస్థను చక్కదిద్దుతూ ప్రభుత్వం సజావుగా నడిచేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో రికమండేషన్లు తనను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయంటూ ఆ మంత్రి ఇంటర్నల్ గా ఫీలవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇటీవల ఓ మంత్రి దురుసు వ్యాఖ్యలతో బాధపడ్డ కొత్త మంత్రి.. సీనియర్ల నుంచి ప్రెజర్స్ రావడంతో డైలమాలో ఉన్నారు. తనకే ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయా? అని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
Also Read: Tollywood: బాలీవుడ్‌లా మారుతున్న టాలీవుడ్.. కంట్రోల్ తప్పుతున్నట్లేనా?
ఓ సెపాలజిస్టు చక్రం…?
ఇటీవల ఓ టీవీ డిబెట్ లో కాంగ్రెస్(Congress) పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోతుందని చెప్పిన సెపాలజిస్టే.. ఈ ఓ ఎస్డీ నియామకంలో కీలకంగా వ్యహరించినట్లు సమాచారం. సీనియర్ మంత్రి నుంచి లెటర్ తెప్పించడం, ఎన్ డార్స్ చేయించి ఇవ్వడం తో పాటు స్వయంగా సెక్రటేరియట్ కు వచ్చి సదరు ఓఎస్టీని కొత్త మంత్రికి పరిచయం చేసి ..ఉద్యోగంలో తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. వాస్తవానికి సెఫాలజిస్టుగా చెప్పుకుంటున్న సదరు వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే సర్వేల పేరిట పలువురు ఎమ్మెల్యే అభ్యర్ధులను నిత్యం కలుస్తూ ఉండేవారు. పవర్ లోకి వచ్చాక గతంలో తాను చేసిన సర్వేలు కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చాయని ప్రచారం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తనతో సన్నిహితంగా ఉంటారని ప్రచారం చేయడంతో ఎమ్మెల్యేలు, మంత్రులూ ఆ సెఫాలజిస్టుగా ప్రచారం లో ఉన్న వ్యక్తి చెప్పింది వినాల్సి వస్తున్నది. అయితే ఓ టీవీ డిబేట్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత..వెంటనే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సెఫాలజిస్టుకు కాంగ్రెస్ సంబంధం లేదని, ఆయనకు గాంధీభవన్, సెక్రటేరియట్ తో సంబంధాలు లేవని ప్రకటించింది. కానీ ఆయన ఇప్పటికీ సచివాలయంలోని మంత్రులు, ఆఫీసర్ల పేషీల్లో తిరుగుతూనే కనిపించడం గమనార్హం.
మరో శాఖపై ఇన్వాల్వ్ కావొద్దు..?
ఒక మంత్రి మరో మంత్రి శాఖలో ఇన్వాల్వ్ కావొద్దని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మరో మంత్రి సబ్జెక్ట్, శాఖాపరమైన అంశాలను ఎక్కడా మాట్లాడవద్దని, ఒకరి శాఖలో మరోకరు తలదూర్చవద్దని స్పష్టంగా నొక్కి చెప్పారు. కానీ ఇప్పటికీ సీనియర్ మంత్రుల్లోని కొందరు కొత్త మంత్రులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలిసింది. అంతేగాక శాఖపరంగానూ ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలిసింది. పేషీల స్టాఫ్ నియామాకాలు దగ్గర్నుంచి వివిధ శాఖపరమైన కాంట్రాక్టులు, వర్క్స్, ఇతరాత్ర అంశాల్లో విరివిగా తలదూర్చుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ మహిళా మంత్రి, మరో కీలక మంత్రి మధ్య వచ్చిన విభేదాల్లోనూ ఇదే కారణం గా స్పష్టమవుతున్నది.
Also Read; Pak vs Afghan War: పాక్-అఫ్గాన్ మధ్య ఎందుకు చెడింది.. ఘర్షణలకు కారణమేంటి.. దీని వెనుక భారత్ ఉందా?
