venu-swamy( image ;X)
ఎంటర్‌టైన్మెంట్

Venu Swamy puja: తాంత్రిక పూజలు చేస్తూ మరోసారి వైరల్ అయిన వేణు స్వామి .. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

Venu Swamy puja: టాలీవుడ్‌లో ప్రముఖ జ్యోతిష్యుడైన వేణు స్వామి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన కాశీలోని వటుక కాలభైరవుడికి చేసే పూజ ఇది, దీనిని నార్త్ లోని ప్రసిద్ధ దేవాలయంలో ప్రత్యేకగా చేస్తారు. అని పూజల గురించి వివరిస్తూ, సినిమా పరిశ్రమలో, రాజకీయాలలో, సోషల్ మీడియా లో భారీ పాపులారిటీ సాధించాలంటే ఈ పూజ చేయాలని సూచించారు. ఇక్కడ చేసే పూజలు తాన్త్రిక విధానాలతో జరుగుతాయి. జీవితంలో విజయం, ఆకర్షణ, కెరీర్‌లో ఎదుగుదలకు సహాయపడతాయని వేణు స్వామి తన వీడియోలో చెప్పారు. ముఖ్యంగా హీరోయిన్లు లేదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు రాజకీయ రంగంలో పాపులారిటీ పొందాలనుకునే వారు ఈ పూజ చేస్తే పాపులారిటీ, సక్సెస్ సులభంగా వస్తాయని ఆయన వివరించారు. ఉదాహరణకు, పలువురు స్టార్ హీరోయిన్ లు పూజలు, హోమాలు చేయించుకుని పెద్ద ఎత్తున విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు.

Read also-Flora Saini controversy: ఆ పాత్రలు నాకు గుర్తింపు తెచ్చాయి.. అందుకే అలా.. ఫ్లోరా సైనీ..

వటుక భైరవుడికి సంబంధించిన పూజను చేస్తూ ఈ పూజలో మధ్యం, మాసం ఖచ్చితంగా ఉండాలని లేకపోతే ఈ పూజ అసంపూర్తిగా అవుతుందని అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సమయంలో ఈ పూజను చేస్తామన్నారు. శత్రువుల నాశనము శత్రువుల మీద జయము ఈ పూజ చేస్తే పొందుతారని వివరించారు. తాజాగా ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మళ్లీ మొదలెట్టావా అంటూ నెటిజన్లు వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. వటుక భైరవునికి సంబంధించిన పూజలు మరీ వైలెంట్ ఉన్నాయంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు ముందు ఏం మాంసం తింటున్నాడని ఓ ప్రసిద్ధ ఆలయంలోకి వేణు స్వామిని అడ్డుకోవడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read also-Meher Ramesh: ఆ స్టార్ హీరో డేట్స్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్న మెహర్ రమేశ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?

ఈ ఘటన అక్టోబర్ 2025లో జరిగినప్పటికీ, పూజ సంబంధిత మునుపటి వీడియోలు ఇప్పటికీ చర్చనీయాంశమే. వేణు స్వామి టాలీవుడ్ సెలబ్రిటీలతో సన్నిహితంగా ఉంటూ హీరోయిన్లకు పూజలు చేయించి వారి కెరీర్ విజయాలకు కారణమని చెబుతూ ప్రసిద్ధి పొందారు. ఈ వీడియో సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారిలో ఆసక్తి రేకెత్తించడంతో పాటు, ఆధ్యాత్మికత, జ్యోతిష్యం చర్చలకు దారి తీసింది. ఈ పూజలు చూసిన నెటిజన్లు వామ్మే ఏంది సామీ భయపెడుతున్నావు అవి చూస్తుంటేనే భయమేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా అయన చేసిన పనులకు ఆశ్యర్యపోతున్నారు. దీనిపై వేణు స్వామి ఎలా స్పంది స్తారో చూడాలి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!