flora-saini( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Flora Saini controversy: ఆ పాత్రలు నాకు గుర్తింపు తెచ్చాయి.. అందుకే అలా.. ఫ్లోరా సైనీ..

Flora Saini controversy: తెలుగు, హిందీ సినిమాల్లో పాపులర్ నటి ఫ్లోరా సైనీ (ఆషా సైనీ) బిగ్ బాస్ 9 నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆమెపై వచ్చిన ఆరోపణల గురించి వివరణ ఇచ్చారు. మీరు బిగ్ బాస్ 9 కి వెళ్ళేముందు మీరు అశ్లీల చిత్రాల్లో నటించారు అంటూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వాటి గురించి మీరు ఏం అంటారు అని యాంకర్ అడగ్గా.. ‘అలాంటి వాటిలో నేనే నటించలేదు కానీ అలాంటి పాత్ర చేశాను ఆ సమయంలో మ అమ్మ కూడా నా పక్కనే ఉంది. అది తప్పు అయితే ఆమె చెబుతుంది కదా.. అసలు నేనే చెయ్యను కదా’ అని చెప్పుకొచ్చారు. దీంతో అప్పుడు ఆమె వీడియోలను ట్రోలో చేసిన వారికి గట్టిగా సమాధానం ఇచ్చినట్లు అయింది. 2001లో బాలకృష్ణతో ‘నరసింహ నాయుడు’లో డెబ్యూ చేసి ఫేమస్ అయ్యారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి తెలుగు హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు.

Read also-Tollywood trolling: టాలీవుడ్ లో ఒక మూవీ టీంపై ఇంకో మూవీ టీం ట్రోలింగ్స్ చేసుకుంటాయా?.. ఇందులో నిజమెంత?

ఫ్లోరా సైనీ.. హిందీలో ‘బేగుం జాన్’, ‘స్త్రీ’ (భూత రోల్), ‘లక్ష్మీ’లో కనిపించింది. ఇటీవల ‘స్త్రీ 2’లో ఆమె పాత్ర చర్చనీయమైంది. కానీ, ఆమె కెరీర్ మలుపు వచ్చింది వెబ్ సిరీస్‌ల వైపు. 2018లో ఆల్ట్ బాలాజీ ‘గాండీ బాట్’లో పోల్స్‌లా బౌది పాత్ర చేసి హిందీలో గుర్తింపు పొందింది. ఈ బోల్డ్, సెన్సువల్ షో వల్ల ఆమెకు ఫ్యాన్స్ పెరిగారు. కానీ కొందరు ‘పోర్న్ స్టార్’ లేదా ‘సెమీ-పోర్న్’ అని ట్యాగ్ చేశారు.ఇతర సిరీస్‌లలో కూడా బోల్డ్ రోల్స్ చేసింది. ఈ ‘పోర్న్ స్టార్’ ట్యాగ్ మీద ఫ్లోరా బలంగా రియాక్ట్ అయింది. ‘గాండీ బాట్’ బోల్డ్ రోల్, కానీ పోర్న్ కాదు. అది చాలెంజ్‌గా తీసుకున్నాను” అంటూ ఆమె తెలపారు.  ‘స్త్రీ’, ‘బేగుం జాన్’ వంటి ప్రాజెక్టులను గుర్తుచేసుకోమని తెలిపారు. 2022లో ఒక ఇంటర్వ్యూలో ‘గాండీ బాట్’ గురించి మాట్లాడుతూ, “చాలా మంది దాని వల్ల నన్ను తెలుసుకున్నారు. అది కాంప్లిమెంట్. బోల్డ్ స్టోరీ, ప్రేక్షకులకు క్లిక్ అయింది. గ్రేస్‌తో చేశాను. రియల్ లైఫ్‌లో నేను వేరు, స్క్రీన్ పాత్రలు వేరు” అని చెప్పింది. ఈ రికగ్నిషన్ మీద గర్వంగా ఉందని, కానీ సెన్సువల్ రోల్స్ బోర్ అయ్యాయని కూడా అన్నది.

Read also-Telusu Kada Censor Report: ‘తెలుసుకదా’ సెన్సార్ పూర్తి.. ఆ సీన్ తీసేయాల్సి వచ్చిందా..?

బిగ్ బాస్ 9 ఎంట్రీ సమయంలో మీడియా ‘శృంగార తార’ అని పిలిచింది. దాన్ని గుర్తించి, “బోల్డ్ రోల్స్ చాలెంజ్, మహిళల ఎంపవర్‌మెంట్ కోసం పోరాడుతున్నాను” అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7, 2025న స్టార్ట్ అయింది. నాగార్జున హోస్ట్. ఫ్లోరా రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ కేటగిరీలో రూ. 5-6 లక్షలు రిమ్యూనరేషన్. షోలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సంజనా గల్రానీకి సపోర్ట్, సేవలు. టాస్క్‌లలో కొన్ని మిస్టేక్స్. అక్టోబర్ 12న ఐదో వీక్‌లో ఎలిమినేట్ అయ్యారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!