telusu-kada( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Telusu Kada Censor Report: ‘తెలుసుకదా’ సెన్సార్ పూర్తి.. ఆ సీన్ తీసేయాల్సి వచ్చిందా..?

Telusu Kada Censor Report: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా దర్శకురాలిగా ఆరంగేట్రం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా UA సర్టిఫికేట్ తో 135.45 నిమిషాల డ్యూరియేషన్ ఫైనల్ చేశారు సెన్సార్ బోర్డు. అయితే ఈ సినిమా ట్రైలర్ లో ఒచ్చిన ఓ డైలాగ్ సినిమాలో నుంచి తొలగించారు. అది ఏంటంటే.. నేనే ఒంగుంటా నా మీద ఎక్కు అన్న డైలాగ్ ఈ సినిమాలో నుంచి తీసివేసినట్లుగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా రాశి ఖన్నా ఫేమస్ చేసిన డైలగ్ మరో మూడు డైలాగులను కూడా తొలగించారు. వీటన్నింటినీ తొలగించిన తర్వాత సినిమా డ్యూరియేషన్ 136 నిమిషాలుగా ఫైనల్ చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే అంచనాలు మరింత పెరిగాయి.

Read also-Meesaala Pilla: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి ‘మీసాల పిల్ల’ సాంగ్ రిలీజైంది.. చూసేయండి..

టిల్లు స్క్వేర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఈ యువ హీరో, తన కెరీర్‌లో మరో మైలురాయిని నెలకొల్పుకోవడానికి సిద్ధమవుతున్నాడు. పరిచయమయ్యే ఈ చిత్రం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్లల రూపొందిస్తున్నారు. టీజర్ అయితే యువతను అమితంగా ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ప్రచారాన్ని పెంచడంలో హిట్ అయిందనే చెప్పాలి. నిర్మాతలు విడుదల చేసిన రెండో మెలొడీ సినిమాకు ఎసెర్ట్ కానుంది. ఈ పాటను చూస్తుంటే.. తెలుసుకదా తెలుసు కదా.. ఆగమంటే ఆగుతుందా అంటూ మొదలవుతోంది సాంగ్. కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా మెలొడీలతో మైమరపించే థమన్ సంగీతం అందించారు. ఈ పాటలో సింగర్ కార్తిక్, సంగీత దర్శకుడు థమన్, సింగర్ అద్వైత కలిసి కనిపిస్తారు. ఈ పాట మొత్తం ఎంతో వినసొంపుగా చాలా కాలం తర్వాత కొత్తదనంతో కూడిన మెలొడీలా అనిపించింది. లొకేషన్స్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విడుదలైన ఈ పాట మంచి మెలొడీ ఉండటంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. విడుదలైన కొంత సేపటికే లక్షల్లో వ్యూస్ సంపాదించుకుంది. థమన్ ఈ సినిమాకు మరో హిట్ మెలొడీ అందించారని అర్థమవుతోంది.

Read also-Sanjay Kapur: సంజయ్ కపూర్ ఆస్తి వ్యవహారంలో మరో మలుపు.. అసలు పిల్లులు ఎవరంటే?

‘తెలుసు కదా’ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇది యూత్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్ర యూనిట్ సూచించినట్టు, కథలో పూర్తిగా కొత్త కథాంశం ఉంటుంది, ఇది యువతను ఆకర్షించేలా రూపొందించబడింది. హీరోయిన్‌గా రాశీ ఖన్నా, KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో మెదవనున్నాడు. సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన ట్యూన్స్, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి (జాతీయ అవార్డు విజేత) ఎడిటింగ్‌తో ఈ చిత్రం హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌లో నిర్మించబడుతోంది. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ వంటి టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ కూడా ఈ సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!