Meesaala Pilla: మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). తాజాగా ఈ సినిమా నుంచి ‘మిసాల పిల్ల’ ఫుల్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఇప్పటికే తెగ వైరల్ అయిన ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రారంభం నుంచే అనిల్ రావిపూడి తనదైన శైలి ప్రచారంతో నిత్యం ఈ సినిమాను ప్రజల్లో ఉంచుతున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి గ్రాండ్ కాన్వాస్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు మొదటి సింగిల్ ‘మీసాల పిల్ల’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవికి కొన్ని చార్ట్ బస్టర్ సాంగ్స్ పాడిన ఉదిత్ నారాయణ్‌ను ఈ పాట పాడేందుకు తీసుకొచ్చిన అనిల్ రావిపూడి.. ఆయనతో కూడా ప్రమోషన్స్ నిర్వహించడం విశేషం. దసరాను పురస్కరించుకుని విడుదల చేసిన ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమోపై బీభత్సంగా రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఫుల్ సాంగ్‌ను ఈ సోమవారం (అక్టోబర్ 13) విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాంగ్ రిలీజ్ టైమ్ కూడా అనౌన్స్ చేశారు. కానీ, చివరి నిమిషంలో ఈ పాటను వాయిదా వేసి ఇప్పుడు విడదల చేశారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Sanjay Kapur: సంజయ్ కపూర్ ఆస్తి వ్యవహారంలో మరో మలుపు.. అసలు పిల్లులు ఎవరంటే?
‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్లా పాటను చూస్తుంటే చాలా కాలం తర్వాత మెగాస్టార్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎప్పడూ చిరు సినిమాల్లో పాటలు చాట్ బాస్టర్ గా నిలుస్తాయి. ఈ పాట మరో చాట్ బాస్టర్ గా నిలుస్తోంది. భాస్కరభట్ల అందించిన ‘మీసాల పిల్లా’ అనే లిరిక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మెగాస్టార్ నయనతార తో వేసిన స్టెప్పులు మళ్లీ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా ఉన్నాయి. భీమ్స్ అందించిన సంగీతానికి మెగాస్టార్, నయనతార కలిసి మేజిక్ చేశారు. ఉదిత్ నారాయణ్ మరోసారి మెగాస్టార్ కు హిట్ సాంగ్ అందించారు. లిరిక్స్ మెత్తం అందరూ పాడుకునేవిగా ఉన్నాయి. ఈ ఫుల్ సాంగ్ చూసిన అభిమానులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
