Cm Revanthreddy Key Advices To Officials In CCC View Rain Season
Politics

CCC: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం, అధికారులకు కీలక ఆదేశాలు

– వర్షాకాలం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చ
– సమన్వయంతో అన్ని విభాగాలు పని చేసేలా ప్లాన్స్
– ఇప్పటికే 141 వరద తీవ్రత ప్రాంతాల గుర్తింపు
– వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న సీఎం

Cm Revanthreddy Key Advices To Officials In CCC View Rain Season: మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త ఉన్నారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు రేవంత్ రెడ్డి. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని తెలిపారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం, మంత్రులు. ఇప్పటికే 141 వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపిన అధికారులు, వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Also Read: కేసీఆర్‌ లేఖపై కాంగ్రెస్ రియాక్షన్

నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వెళ్లేలా వాటర్ హార్వెస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చపట్టాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల రిక్రూట్‌మెంట్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!