Jubilee Hills By Election (imagecredit:swetcha)
తెలంగాణ, హైదరాబాద్

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు మోగిన నగారా.. గెజిట్‌ రిలీజ్‌!

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందడి మొదలైంది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ కర్ణన్(Karnana) ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో సోమవారం ఒక్క రోజే పది మంది అభ్యర్థులు 11 సెట్లుగా నామినేషన్లను సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్(Naveen yadav) పేరును ఖరారు చేయగా, అంతకు ముందే బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత(Maganti Sunitha) పేరును ఖరారు చేసింది. బీజేపీ కూడా అభ్యర్థిని ఖరారు చేస్తే.. బై ఎలక్షన్ వేడి మరింత రాజుకోనున్నది. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసే అవకాశముండడంతో ఈ నియోజకవర్గం ఉప ఎన్నిక సర్వత్రా ఆసక్తి కరంగా మారనున్నది. నామినేషన్లు సమర్పించిన అభ్యర్థుల్లో రెండు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు కాగా, ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్‌లు దాఖలు..

తెలంగాణ పునర్ నిర్మాణ సమితి తరపున పూస శ్రీనివాస్(Pusa Srinivass), నవ తరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు(Srinivasa Rao) నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్(Srikanth), పెసర కాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, ఇబ్రహీం ఖాన్‌, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్‌లు నామినేషన్‌లు దాఖలు చేయగా, ట్రిపుల్‌ఆర్ భూ సేకరణను నిరసిస్తూ, భూ బాధితులకు మద్దతుగా వేముల విక్రమ్ రెడ్డి కూడా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లను స్వీకరించిన వెంటనే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆఫీసు అధికారులు నామినేషన్ పత్రాలను భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు.

Also Read: Kantara 1 mistake: ‘కాంతార చాప్టర్ 1’లో ఈ సీన్ చూశారా.. దొరికేశారుగా..

రిటర్నింగ్ ఆఫీసును సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి

జూబ్లీ‌హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి షేక్‌పేట మండల ఆఫీసులో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసును జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సందర్శించి అక్కడే ఎలక్షన్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ, నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైందని, ఈ ప్రక్రియ 21 వరకు చేపట్టి, 22న నామినేషన్ల పరిశీలన జరపనున్నట్లు, 24న నామినేషన్ల విత్ డ్రా ఉంటుందన్నారు. ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులు తుది జాబితాను ప్రకటించి, వచ్చే నెల 11న పోలింగ్, ఆ తర్వాత 14వ తేదీన డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసిన యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించి, ఫలితాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఎలక్షన్ ఏర్పాట్లను రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా, భారతీయ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నామినేషన్‌ల స్వీకరణకు సర్వ సిద్దంగా ఉండాలని రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాంకు సూచించారు.

Also Reda; Gadwal District: ఇందిరమ్మ ఇళ్ల ఇసుక టిప్పర్ల నిలిపివేత.. కమిషన్ కోసమే అడ్డుకుంటున్నారా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!