Bandi Sanjay (imagecredit:swetcha)
తెలంగాణ

Bandi Sanjay: దేశానికి ఆదర్శం చర్లపల్లి జైలు: కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay: సంస్కారణలతోపాటు ఖైదీల సంక్షేమానికి చర్లపల్లి జైలు దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Minister Bandi Sanjay) అన్నారు. ఖైదీలకు బీమా సౌకర్యం, వారి కుటుంబ సభ్యులకు వడ్డీలేకుండా రుణ సదుపాయం కల్పించడం అభిందనీయమన్నారు. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదవిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా(DG Soumya Mishra) విజన్ అభినందనీయమని చెప్పారు. కస్టడీ-కేర్-కరక్షన్ కు సౌమ్య మిశ్రా నిజమైన అర్థం చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

ఓ లేగ ‘క్రిష్ణ’ అని పేరు..

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చర్లపల్లి జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీలు, ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. గోశాలను సందర్శించి గోవులకు మేత తినిపించారు. ఓ లేగ ‘క్రిష్ణ’ అని పేరు పెట్టారు. జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ క్లబ్, బంతి పూల వనాన్ని సందర్శించారు. అనంతరం అధికారులు ఖైదీల కోసం జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలను కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. 25 ఏళ్ల క్రితం చర్లపల్లి జైలును నిర్మించారని నాటి నుండి నేటి వరకు ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్లపల్లి జైలు అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ.11.60 కోట్లు మంజూరు చేయగా, రూ. 11.30 కోట్లు ఖర్చు చేసి వివిధ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు.

Also Read; Bandi Sanjay Kumar: ఆర్ఎస్ఎస్ కవాతులో కేంద్ర మంత్రి బండి సంజయ్

చదువుకునేందుకు విస్త్రత అవకాశాలు

సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన తరువాత విప్లవాత్మకంగా సంస్కరణలు చేపట్టారన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులకు వీడియో లింక్ ద్వారా తాము ఉన్న ప్రాంతాల నుండే మాట్లాడే (ములాఖత్) అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. ఖైదీలకు బీమా సౌకర్యాన్ని వర్తింపజేసినట్లు పేర్కొన్నారు. ఖైదీలు చదువుకునేందుకు విస్త్రత అవకాశాలు కల్పించడంతోపాటు చదవు పూర్తయ్యాక డిగ్రీలు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఖైదీల ఆరోగ్యంపైనే ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. రోజుకు సగటున 150 మంది ఖైదీలు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు. ప్రతి రోగికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించినట్లు వివరించారు. ఖైదీలకు ప్రతిరోజు యోగా, ధ్యానం, పీఈటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ లో ‘ప్రత్యేకంగా మేళా’..

ఖైదీలకు స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో ప్రత్యేకంగా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలు విడుదలైన తరువాత పెట్రోలు బంకుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ ప్రతి నెలా రూ.18 వేల చొప్పున కనీస వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడా(Sports) పోటీల్లో తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు అగ్రగామిగా నిలుస్తున్నారని తెలిపారు. జైళ్ల శాఖ అందిస్తున్న సేవలు, చేస్తున్న అభివ్రుద్ధికి గాను ప్రతిష్టాత్మకమైన స్కోడా అవార్డు వచ్చినట్లు వివరించారు. దీనిని అభినందించిన బండి సంజయ్ ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖ అధికారులు చర్లపల్లి జైలును సందర్శించేలా చూస్తానని చెప్పారు. తద్వారా దేశ వ్యాప్తంగా ఇలాంటి సంస్కరణలు అమలయ్యేట్టు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యంగా ఉన్నాయాంటూ హైదరాబాద్ లో ‘ప్రత్యేకంగా మేళా’ నిర్వహించి ఆయా ఉత్పత్తులు ప్రజలకు అందించాలని సూచించారు. జైళ్ల శాఖకు కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, చర్లపల్లి జైలు సూపరింటెండ్ నవాబ్ శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: IRCTC Scam Case: బీహార్ ఎన్నికలకు ముందు.. లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్.. కోర్టు సంచలన ఆదేశాలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!