KTR ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Politics, లేటెస్ట్ న్యూస్

KTR: దొంగ ఓట్లపై కాంగ్రెస్‌ ను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల క్షేత్రంలో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లు.. డూప్లికేట్ ఓట్లు ఇతర అవకతవకలపై బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ ఎట్లన్న గెలవాలని అన్ని అడ్డగోలుదారుల్లో ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సామా, ధానం, భేద దండోపాయాలతో ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Also Read:KTR: ఫార్ములా-ఈ రేస్‌తో గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా హైదరాబాద్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు 

20వేల దొంగ ఓట్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో

నిధులు లేవని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ బ్యాంకుకి, వార్త పత్రికలకు లేఖలు రాస్తున్న సందర్భంగా జూబ్లీహిల్స్ లో మాత్రం భారీగా నిధులు ఉన్నాయని ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికార దుర్వినియోగంతో పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో చేస్తున్న దొంగ ఓట్ల ప్రయత్నం పైన ఈసీకి రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే… చోరీ ఓట్లతో ఇక్కడ గెలవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. 400 ఎన్నికల బూత్ లో కనీసం 50 దొంగ ఓట్లను, ఇలా కనీసం 20వేల దొంగ ఓట్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నమోదు చేయించిందని మండిపడ్డారు.

ఒక్కొక్క ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల నమోదు

ఒక్కొక్క వ్యక్తికి మూడు, మూడు ఎన్నికల గుర్తింపు కార్డులో ఉన్నాయన్నారు. ఒకటే అడ్రస్తో మూడు ఓట్లు నాలుగు ఓట్లు ఒక్కొక్కరు నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. మేము చెబుతున్న ప్రతి అంశం కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నదాని వెల్లడించారు. ఇంకా ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల నమోదు చేశారన్నారు. 15 వేల ఓట్లు చిరునామాలు లేకున్నా ఓట్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. జూబ్లీహిల్స్ లో ఓట్లు ఉన్నవాళ్లకి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయన్నారు.దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా అనుమానం ఉన్నదన్నారు.

అధికారుల పైన చర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్ కింది స్థాయి అధికారులతో కుమ్మక్కు దొంగ ఓట్లు చేర్చినట్టు అనుమానం సైతం ఉందన్నారు. ఈ మొత్తం ఓటర్ లిస్టు అవకతవకల పైన వాటిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి అని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో కుమ్మకు అయిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. 12వేల ఓట్లను వివిధ కారణాలతో తొలగించిన తర్వాత కూడా అదనంగా 7వేలు కొత్తగా చేరాయని మొత్తంగా డిలీట్ చేసినవి కొత్తగా చేరినవి కలిపితే సుమారు 19 కొత్త ఓట్లు కాంగ్రెస్ పార్టీ దొంగతనంగా చేర్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె. కిశోర్ గౌడ్, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, క్రిశాంక్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also ReadKTR: స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?