Meesala Pilla Song: చిరు అనిల్ మూవీ మీసాల పిల్ల పాట వాయిదా
Meesala Pilla Song
ఎంటర్‌టైన్‌మెంట్

Meesala Pilla Song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రిలీజ్ వాయిదా..

Meesala Pilla Song: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా రూపుదిద్దుకుంటున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Lady Super Star Nayanthara) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. అందుకు తగినట్లుగానే ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచే అనిల్ రావిపూడి తన మార్క్ ప్రమోషన్స్‌తో నిత్యం ఈ సినిమాను వార్తలలో ఉంచుతున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి గ్రాండ్ కాన్వాస్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను మేకర్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

Also Read- Devara Movie: రిలీజైన ఏడాదికి అమ్ముడైన దేవర శాటిలైట్ రైట్స్.. మరీ ఇంత దారుణమా!

ఫుల్ సాంగ్ రిలీజ్ వాయిదా..

చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుపుతూ.. ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమోని విడుదల చేసి, ఒక్కసారిగా అంచనాలను డబుల్ చేసేశారు. మెగాస్టార్ చిరంజీవిలో కొన్ని చార్ట్ బస్టర్ సాంగ్స్ పాడిన ఉదిత్ నారాయణ్‌ను ఈ పాట పాడేందుకు తీసుకొచ్చిన అనిల్ రావిపూడి.. ఆయనతో కూడా ప్రమోషన్స్ నిర్వహించడం విశేషం. దసరాను పురస్కరించుకుని విడుదల చేసిన ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమోపై బీభత్సంగా రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఫుల్ సాంగ్‌ను ఈ సోమవారం (అక్టోబర్ 13) విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాంగ్ రిలీజ్ టైమ్ కూడా అనౌన్స్ చేశారు. కానీ, చివరి నిమిషంలో ఈ పాటను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Also Read- Bigg Boss Telugu 9: వైల్డ్ కార్డు ఎంట్రీస్‌కు లింక్ పెట్టి నామినేషన్స్.. ఏం ప్లాన్ చేశావయ్యా?

సరిపడా ట్రీట్‌ ఇస్తాం

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఈ వాయిదాలు కామనే. ఇది ప్రేక్షకులకు కూడా అలవాటైపోయింది. టీజర్, సాంగ్, ట్రైలర్ ఏదైనా సరే.. వారు విడుదల చేస్తామన్న టైమ్‌కి అస్సలు విడుదల చేయడం లేదు. ఈ మధ్య కాలంలో ఇది బాగా ఎక్కువైంది కూడా. అయినా, రెడీ అవకుండా ఎందుకు డేట్, టైమ్ ప్రకటిస్తారని నెటిజన్లు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ, మేకర్స్‌లో మార్పు రావడం లేదు. ‘మన శంకరవరప్రసాద్ గారు’లోని ‘మీసాల పిల్ల’ సాంగ్ విషయానికి వస్తే.. ఈ పాటను ఒక రోజు ఆలస్యంగా అంటే మంగళవారం విడుదల చేస్తామని మేకర్స్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ పాట కోసం ఎదురు చూసే వారందరి ఎదురు చూపులకు సరిపడా ట్రీట్‌ని కచ్చితంగా ఇస్తామని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ అధికారికంగా ట్వీట్ చేసింది. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్బమ్‌తో సంచలనం సృష్టించిన మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం