Devara Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే కాదు, అన్ని సినిమా ఇండస్ట్రీలకు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అనేది థియేట్రికల్ రన్‌తో సంబంధం లేకుండా నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టే వనరులుగా మారాయి. థియేట్రికల్‌గా సినిమా బాగా ఆడకపోయినా, ఈ రైట్స్ రూపంలో నిర్మాత సేఫ్ జోన్‌లోనే ఉంటాడు. అందుకే, ఇంకా నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. ఈ మధ్యకాలంలో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే మాట బాగా వినబడుతోంది. అయినా కూడా, నిర్మాతలు సినిమాలు తీస్తున్నారంటే కారణం, వారికి ఉన్న ఈ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులే. కాకపోతే, ఈ రైట్స్ విషయంలో కూడా ఈ మధ్య ఓ సిండికేట్ నడుస్తుంది. స్టార్ హీరోల సినిమా నుంచి, చిన్న హీరోల సినిమాల వరకు ఈ రైట్స్ విషయంలో ఈ మధ్య వ్యవహారం రివర్సైంది. అనుకున్నంత ఈజీగా అయితే ఈ రైట్స్ అమ్ముడు పోవడం లేదు. అందుకు ఉదాహరణే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన ‘దేవర’ చిత్రం (Devara Movie).
Also Read- Telusu Kada Trailer: ఇద్దరు భామలతో స్టార్ బాయ్ రొమాన్స్.. ట్రైలర్ ఎలా ఉందంటే..
ఎట్టకేలకు అమ్ముడైన రైట్స్
అవును, ‘దేవర’ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం కావస్తున్నా, ఇంత వరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదు. వాస్తవానికి స్టార్ హీరోల సినిమాలను విడుదలకు ముందే కొన్ని ఛానల్స్ దక్కించుకోవాలని పోటీ పడుతుంటాయి. ‘దేవర’ విడుదలకు ముందు కూడా పోటీ బాగానే ఏర్పడింది. కానీ నిర్మాతలు అత్యాశకు పోయి, ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మి, శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చిన కోట్‌కి త్రిబుల్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. దీంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకోవాలని ప్రయత్నించిన స్టార్ గ్రూప్ వెనక్కి తగ్గింది. అంతే, అప్పటి నుంచి మళ్లీ ‘దేవర’ శాటిలైట్ రైట్స్‌ని అడిగిన వారే లేరు. నిర్మాతలు కూడా సినిమా విడుదల తర్వాతే అమ్మాలని అలా ఆపేశారు. కానీ, సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో.. శాటిలైట్ రైట్స్ డీల్ అలాగే ఉండిపోయింది. సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి స్టార్ గ్రూప్, అప్పుడు కోట్ చేసిన దాని కంటే సగానికి తగ్గించి మరి ఈ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లుగా తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇది దారుణమే. సినిమా విడుదలకు ముందే అమ్మేసి ఉంటే, నిర్మాతలు చాలా వరకు సేఫ్ అయ్యేవారు. వారి అత్యాశ ఎంత వరకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Bigg Boss Telugu 9: వైల్డ్ కార్డు ఎంట్రీస్‌కు లింక్ పెట్టి నామినేషన్స్.. ఏం ప్లాన్ చేశావయ్యా?
హిందీలో ఫస్ట్
ఒక్క ‘దేవర’ అనే కాదు.. ఓటీటీ, శాటిలైట్ డీల్ క్లోజ్ కానీ స్టార్ హీరోల సినిమాలు సినిమా ఇండస్ట్రీలలో చాలానే ఉన్నాయి. వాటికి మోక్షం ఎప్పుడనేది మాత్రం చెప్పడం కష్టం. ఇక ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న స్టార్ గ్రూప్.. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను అక్టోబర్ 26న స్టార్ గోల్డ్‌లో టెలికాస్ట్ చేసేందుకు కూడా సిద్ధమైంది. స్టార్ మాలో ‘దేవర’ తెలుగు వెర్షన్ టెలికాస్ట్ కానుంది. అది ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా ఈ దీపావళికి లేదంటే క్రిస్మస్.. అప్పటికి రాకుంటే.. వచ్చే సంక్రాంతికి పక్కాగా ఈ సినిమా స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది. త్వరలోనే ‘దేవర 2’ చిత్రం చిత్రీకరణ జరుపుకోనుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
