Bigg Boss 9 Telugu: ఎవరూ ఊహించని విధంగా ఫ్లోరా తో పాటు, శ్రీజ దమ్మును కూడా ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా ఎవరు బాగా పెర్ఫర్మ్ చేశారంటే ముందుగా శ్రీజ పేరునే చెబుతారు. ఎందుకంటే, ఈ అమ్మాయి అందరికీ గట్టి పోటీనిచ్చింది. అలాగే, బిగ్ బాస్ 9 లోకి ఎంటర్ అయినా తర్వాత కూడా టాస్క్ లు చేస్తూ.. మాట్లాడిల్సిన చోట వాయిస్ ను రేజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి తను టఫ్ ఫైట్ ను ఇచ్చింది. అలాంటి శ్రీజ ను మీరు ఎలా ఎమిలిమినేట్ చేస్తారంటూ బిగ్ బాస్ పై నెటిజన్స్ మండి పడుతున్నారు.
Also Read: Actress Vishnupriya: తెలుగు వాళ్ళకి అవకాశాలు వచ్చినా సీరియల్స్ చెయ్యట్లేదు.. నటి సంచలన కామెంట్స్
ఈ ఎలిమినేష్ న్ అన్ ఫెయిర్ అనే కన్నా.. పచ్చి మోసం అని అనాలి. ఆమె చేసిన టాస్క లలో కూడా గెలిచినా ఆమె పేరు చెప్పకుండా.. పవన్ పేరు అనౌన్స్ చేశారు. ఇది చాలా దారుణం బిగ్ బాస్ , మళ్ళీ ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకోండి అని ఎంతో మంది కోరుకుంటున్నారు. జనాలు వేసే ఓట్లకు విలువ లేదా? రీతూని సేవ్ చెయ్యడానికి శ్రీజ ఎలిమినేట్ చేయడం ఏంటి? ఇంట్లో ఉండటానికి ఓటింగ్స్ పెట్టారు కదా.. అయితే, ఇప్పుడు పెట్టండి.. ఆమె ఇంట్లో తీసుకురావడనికి, ఎన్ని ఓట్లు పడతాయో మీరే చూడండి.
అయితే, చాలా మంది ఆమె రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి, శ్రీజకు అవకాశం వస్తే ఆమె మళ్లీ హౌస్ లోకి వెళ్తుందో ? లేదో చూడాలి. కొందరు ఆమె నెక్స్ట్ వీక్ వెళ్తుంది. కావాలని బిగ్ బాస్ ఇలా చేశాడని అంటున్నారు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది తొలిసారి.. ఒక కామనర్ అయిన శ్రీజకు లక్షల మంది సపోర్ట్ దొరికింది. మరి, దీన్ని బిగ్ బాస్ యజమాన్యం సీరియస్ గా తీసుకుంటుందో? లేదో చూడాలి. అలాగే రీ ఎంట్రీ ఉంటుందా.. లేక మళ్లీ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారా అనేది చూద్దాం.
