BJP Telangana (imagecredit:twitter)
Politics, తెలంగాణ

BJP Telangana: బీజేపీ జిల్లా అధ్యక్షులతో నిత్యం ఫిర్యాదులు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమలం ..!

BJP Telangana: తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకం ప్రక్షాళనకు దారితీసేలా కనిపిస్తున్నది. పలు జిల్లాల అధ్యక్షులను మార్చే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం కూడా మార్పులు, చేర్పులు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్షులకు, పలువురు ఎంపీ(MP)లు, ఎమ్మెల్యే(MLA)లకు మధ్య పొసగక పోవడమే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. దీంతో పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిచేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పలువురు జిల్లా అధ్యక్షులపై ఫిర్యాదులు సైతం అందడంతో మార్పు చేయక తప్పదనే ప్రచారం జరుగుతున్నది. త్వరలో జూబ్లీహిల్స్(Jublihills) ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని టచ్ చేసే అవకాశం లేదని, ఎన్నికల తర్వాత మార్పులు, చేర్పులు ఉండే అవకాశముందని సమాచారం.

తొలిదశలో ఆరుగురిపై వేటు!

సొంత వ్యవహారాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న జిల్లా అధ్యక్షులు ఎవరనే అంశంపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. తెలంగాణ బీజేపీ(Telangana BJP) లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా వారు విభజించుకున్నారు. ఇప్పటి వరకు 36 జిల్లాలకు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. మేడ్చల్(Medchal) అర్బన్, కరీంనగర్(Karimnagar) జిల్లాల అధ్యక్షులను ఇంకా ప్రకటించలేదు. ప్రకటించిన 36 జిల్లా అధ్యక్షుల్లో పనితీరు సరిగ్గా లేని ఆరుగురిపై తొలిదశలో వేటు వేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా జిల్లా అధ్యక్షుల తొలగింపు ప్రక్రియ ఎలా చేయాలన్న అంశంపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వికారాబాద్(Vikarabad) జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy)పై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy), జిల్లా అధ్యక్షుడికి మధ్య ఏమాత్రం పొసగక పోవడంతో ఆయన సైతం పార్టీకి కంప్లైంట్ చేశారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో పార్టీ సంస్థాగత ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ అందించి వినూత్న నిరసన తెలిపారు.

Also Read: K Ramp controversy: హీరోలను రిపోర్టర్లు అడిగే ప్రశ్నలు కరెక్టేనా?.. లేదా ప్రమోషన్‌లో భాగమా!..

నాయకత్వంపై సమాలోచనలు

ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ధర్మారావు నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం కమిటీ వేసి వికారాబాద్ జిల్లా నేతల అభిప్రాయాలను తీసుకున్నది. దీనిపై ధర్మారావు.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రా(Ramchrnder Rao)వుకు పూర్తి రిపోర్ట్ అందించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిని పక్కకు తప్పించాలనే అంశంపై రాష్​ట్ర నాయకత్వం సమాలోచనలు చేసినట్లు సమాచారం. వికారాబాద్ జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాతో పాటు సిద్దిపేట, పెద్దపల్లి(Peddapally) జిల్లాల అధ్యక్షులను మార్చడంపైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

వాటితో పాటు మరో మూడు జిల్లాల అధ్యక్షులపై రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. పార్టీకి సహకరించని నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు రాంచందర్ రావు పక్కా వ్యూహంతో వెళ్తున్నట్లు టాక్. ఫిర్యాదులపై విచారణ చేసి వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రక్షాళన చేపడితే అయినా నేతల్లో కాస్తయినా భయముంటుందని, కార్యక్రమాలు చురుకుగా చేపట్టే ఆస్కారమున్నదని రాష్​ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నది. కాగా ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులతో రాజీనామా చేయించి, కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారా? నేరుగా పాతవారి స్థానంలో కొత్తవారిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు ప్రకటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read; Oka Manchi Prema Katha: నవ్విస్తూ, ఏడ్పించేలా ‘ఓ మంచి ప్రేమ కథ’.. ట్రైలర్ ఎలా ఉందంటే..

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది