Bigg Boss 9 Telugu: ఎవరూ ఊహించని విధంగా ఫ్లోరా తో పాటు, శ్రీజ దమ్మును కూడా ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా ఎవరు బాగా పెర్ఫర్మ్ చేశారంటే ముందుగా శ్రీజ పేరునే చెబుతారు. ఎందుకంటే, ఈ అమ్మాయి అందరికీ గట్టి పోటీనిచ్చింది. అలాగే, బిగ్ బాస్ 9 లోకి ఎంటర్ అయినా తర్వాత కూడా టాస్క్ లు చేస్తూ.. మాట్లాడిల్సిన చోట వాయిస్ ను రేజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి తను టఫ్ ఫైట్ ను ఇచ్చింది. అలాంటి శ్రీజ ను మీరు ఎలా ఎమిలిమినేట్ చేస్తారంటూ బిగ్ బాస్ పై నెటిజన్స్ మండి పడుతున్నారు.
Also Read: Chanakya Niti: మీ భార్య మీతో ఇలా రోజూ ప్రవర్తిస్తుందా? అయితే, విడాకులు ఇవ్వడమే కరెక్ట్..!
వాళ్ళ కోసం శ్రీజను ఎలిమినేట్ చేశారా?
ఈ సీజన్ కామనర్స్ కూడా ఉంటారని చెప్పి వారికీ నువ్విచ్చే మర్యాద ఇదేనా.. ఇది స్క్రిప్ట్ డ్ షో అనుకోవాలా ? లేక రియాలిటీ షో అనుకోవాలా ? దీనికి సమాధానం నువ్వే చెప్పాలి బిగ్ బాస్ అంటూ ఆమెకి నెటిజెన్స్ సపోర్ట్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పి మంచిగా ఆడుతున్న అమ్మాయి మనసు చంపేసి బయటకు పంపించడం ఎంత వరకు కరెక్ట్? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళలో ఒక్కరైనా ఆడే వాళ్ళు ఉన్నారా? హౌస్ లోకి ఎక్స్ పోజింగ్ చేయడానికి వాళ్ళని పంపించావా? లేక అలాంటి కంటెంట్ కోసం వారిని ఎంచుకున్నావా? ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్. శ్రీజ ఉంటే వాళ్ళని గెలవనివ్వదని అలా బయటకు పంపించారా? ఏది ఏమైనా బిగ్ బాస్ యాజమాన్యం చేసింది తప్పే అని ఒక రేంజ్ లో నెటిజన్స్ ఏకి పారేస్తున్నారు.
Also Read: Mysterious Temples: శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని అత్యంత రహస్యమైన దేవాలయాలున్నాయని తెలుసా?
