BC Reservations (imagecredit:twitter)
Politics, తెలంగాణ

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సర్కార్ సవాల్.. సుప్రీం విచారణపై ఉత్కంఠ?

BC Reservations: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనున్నది. హైకోర్టు(High Cort) ఇచ్చిన మధ్యంతర స్టేను వేకెట్ చేయాలని కోరనున్నది. 42 శాతం రిజర్వేషన్‌ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నది. పార్టీ తరపున పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్(PCC Mahesh Kumar Goud) ఢిల్లీకి వెళ్తుండగా, ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), వాకిటి శ్రీహరి(Vakiti Srihari)లు వెళ్లనున్నారు.

బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఇదే అంశంపై సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ(Abhishek Singhvi) కూడా ప్రభుత్వానికి సలహాలు, సూచనల ఫార్మాట్ ఇచ్చారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలోని టీమ్ స్పెషల్ పిటిషన్ దాఖాలు చేయనున్నది. అయితే హైకోర్టు స్టే పై ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కుతుందని ముందే ఊహించిన పిటిషనర్లు.. ప్రభుత్వం కంటే ముందే కేవియట్ వేయడం గమనార్హం. అంటే ప్రభుత్వం వేసే స్పెషల్ పిటిషన్ లో తమ వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. దీంతో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.

సర్కార్ సీరియస్..

సుప్రీం కోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ ను కన్సిడర్ చేస్తుందా? లేదా హైకోర్టు గడువు ముగిసిన తర్వాత సుప్రీం కోర్టుకు రావాలని సూచిస్తుందా? అనేది సస్పెన్షన్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేరుగా ఢిల్లీలోని పలువురు కీలక అడ్వకేట్లతోనూ డిస్​కషన్ చేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కార్ సీరియస్ గా ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేలా చూడాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఇందిర సహనీ కేసులో విద్యా, ఉద్యోగాల్లో మాత్రమే 50 శాతం సీలింగ్ మించకూడదని ఇచ్చినట్లు రాష్ట్ర సర్కార్ వివరించనున్నది. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రస్తావించలేదని వెల్లడించనున్నది.

Also Read: Monkeys Attack: హుజూరాబాద్‌లో వానరాల వీరంగం.. వేటాడి, వెంటాడి దాడి.. వణికిపోతున్న ప్రజలు

క్లారిటీ కోసం వెయిటింగ్..?

హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేలో రిజర్వేషన్లు అన్నీ 50 శాతం మించకుండా చూస్తూనే.. మిలిగిన సీట్లను ఓపెన్ కేటగిరీలో పరిగణలోకి తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అమలవుతుందని వివరించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై క్లారిటీ రావడం లేదు. పార్టీ పరంగా 42 శాతం సీట్లతో ముందుకు వెళ్లాలా? 50 శాతం సీలింగ్ క్యాప్ లో బీసీలకు 23 శాతం ఇచ్చి, మిగతా సీట్లలో బీసీలకు కేటాయించాలా? అనే దానిపై కూడా కసరత్తు జరుగుతుంది. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించే ముందు ట్రిపుల్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, జనాభా లెక్కలను సేకరించి రిజర్వేషన్‌లు కల్పించామన్న వాదనను ప్రభుత్వం బలంగా ముందుకు తీసుకెళ్లనుంది.దీనిపై స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వాలని సుప్రీం ను సర్కార్ కోరనున్నది.

హైకోర్టు గడువు ఫాలో అయితే కొత్త సంవత్సరంలోనే ఎన్నికలు..?

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం సూచిస్తే.. ప్రభుత్వానికి మళ్లీ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆరు వారాల పాటు కౌంటర్ దాఖాలకు ఆగాల్సిందే. ఆ తర్వాత విచారణ, పిటిషనర్ల విచారణ, తదితర వన్నీ పరిశీలించే నాటికి ఈ ఏడాది పూర్తవుతుందని బీసీ సంఘం నేతలు ఫైర్ అవుతున్నారు. హైకోర్టు ను ఫాలో అయితే కొత్త సంవత్సరంలోనే ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా సుప్రీం లోనే తేల్చుకోవాలని వివరిస్తున్నారు. ఇక బీసీ సంఘం తరపున ఇప్పటికే ఈ నెల 18న బంద్ ప్రకటించడంతో పాటు రిజర్వేషన్ల సాధింపు కోసం ప్రత్యేక జేఏసీ(JAC)ని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.

Also Read: K Ramp controversy: హీరోలను రిపోర్టర్లు అడిగే ప్రశ్నలు కరెక్టేనా?.. లేదా ప్రమోషన్‌లో భాగమా!..

Just In

01

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

Baby Sale Case: దారుణం.. చెల్లిని అమ్మవద్దు అని తల్లి కాళ్ల మీద పడి వేడుకున్న కూతుర్లు.. ఎక్కడంటే?