Akhanda 2
ఎంటర్‌టైన్మెంట్

Akhanda 2: హిందీలో పరిస్థితేంటి? ఆ హీరోల సరసన బాలయ్య నిలుస్తాడా?

Akhanda 2: నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లోనే తొలిసారిగా పూర్తిస్థాయి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ ‘అఖండ 2: తాండవం’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఆయనకు ఉన్న బ్లాక్‌బస్టర్ ట్రాక్ రికార్డు నేపథ్యంలో, ఈ చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాక, హిందీ మార్కెట్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘బాహుబలి, పుష్ప, కార్తికేయ 2’ వంటి విజయవంతమైన చిత్రాల సరసన ‘అఖండ 2’ నిలిచి, బాలయ్యను పాన్-ఇండియా స్టార్‌గా నిలబెడుతుందా అనే చర్చ సినీవర్గాల్లో జోరుగా సాగుతోంది.

డివోషనల్ యాక్షన్ ఫార్ములా

బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రం శివతత్వం, ఆగ్రెసివ్ యాక్షన్ అంశాల కలయికతో రూపొంది, తెలుగులో అద్భుత విజయం సాధించింది. గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో పౌరాణిక, డివోషనల్, యాక్షన్ నేపథ్యం ఉన్న సౌత్ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ‘అఖండ 2’లో బాలకృష్ణ పోషించిన అఘోరా పాత్ర, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు హిందీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశమే ‘అఖండ 2’ హిందీ మార్కెట్‌కు ప్రధాన బలం కానుంది.

Also Read- Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం ఆ ఇద్దరు పండిట్స్! థమన్ స్కెచ్ అదిరింది

ప్రభాస్, అల్లు అర్జున్‌ల సరసన బాలయ్య నిలుస్తారా?

ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలు తమ తొలి పాన్-ఇండియా విజయాలను సాధించడానికి సుదీర్ఘ కాలం పాటు పక్కా ప్రణాళికతో, దేశవ్యాప్త ప్రమోషన్స్‌తో ముందుకు వెళ్లారు. బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని అభిమాన గణం ఉన్నప్పటికీ, హిందీ ఆడియన్స్ దృష్టిలో ఆయన ‘న్యూ ఫేస్’ కిందే లెక్క. గతంలో చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు కూడా హిందీ మార్కెట్‌ను ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయారు. కానీ, ‘అఖండ 2’ నిర్మాణ సంస్థ ముంబైలో భారీ ప్రమోషన్స్, హోర్డింగ్‌ల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించడం, బాలకృష్ణ స్వయంగా హిందీ డబ్బింగ్‌కు ప్రయత్నిస్తున్నారనే వార్తలు సానుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. కంటెంట్ నాణ్యత, సరైన ప్రమోషన్ వ్యూహం తోడైతే, బాలయ్య తన మాస్ ఇమేజ్‌తో హిందీ మార్కెట్‌ను బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Also Read- Tollywood: డబ్బులిచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటూ.. మళ్లీ ఈ సారీలు చెప్పించుకోవడం ఏంటి?

మార్కెట్ అంచనాలు

ఇప్పటికే ‘అఖండ 2’ డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచే అవకాశం లేకపోలేదు. బాలయ్య పవర్, బోయపాటి మార్క్ యాక్షన్ హిందీ ప్రేక్షకులకు నచ్చితే, ఈ సినిమా బాలీవుడ్‌లో పెద్ద హిట్‌గా నిలిచి, బాలకృష్ణను పాన్-ఇండియా స్టార్స్ జాబితాలో నిలబెట్టే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక సినిమా విజయం మాత్రమే కాక, సీనియర్ తెలుగు హీరోల పాన్-ఇండియా విస్తరణకు కూడా ఒక కొత్త దారి చూపినట్టవుతుంది. ‘అఖండ 2’ థియేటర్లలోకి వచ్చిన తర్వాతే హిందీలో బాలయ్య సామ్రాజ్యం ఏ స్థాయిలో విస్తరిస్తుందో తెలుస్తుంది. అప్పటి వరకు ఊహాగానాలు ఓ రేంజ్‌లో ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది