Kcr fires commission
Politics

Hyderabad: చేతకాకుంటే తప్పుకోండి! ఇది వార్నింగా? వివరణా?

– తెలంగాణలో కరెంట్ మంటలు
– ఈఆర్సీ సంస్థల తీర్పులపై కమిషన్లు ఏంటి?
– దురుద్దేశపూర్వకంగానే కమిషన్ ఏర్పాటు
– విచారణ పారదర్శకంగా లేదు
– మాకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనేదే మీ ఉద్దేశమా?
– మా హయాంలో 24 గంటల కరెంట్ అందజేశాం
– సంక్షోభంలోనూ నిరంతర విద్యుత్ అందించాం
– నేను మీ ముందుకు వచ్చినా నో యూజ్
– 12 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన కేసీఆర్
– ఇది కమిషన్‌పై ఎదురుదాడిలా ఉందంటూ కాంగ్రెస్ ఫైర్

KCR gave 12 pages explanation letter to justice and fire: విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో, విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. దీంతో, కేసీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారనే ఉత్కంఠ నెలకొనగా, శనివారం కమిషన్‌కు 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు కేసీఆర్. ఈ లేఖలో కేసీఆర్ చాలా విషయాలను ప్రస్తావించారు. రాజకీయ కక్షతో దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. విచారణ పారదర్శకంగా లేదని, పూర్తి కాకుండానే చైర్మన్ మీడియా సమావేశం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా పదేళ్లు సీఎంగా పనిచేసిన తన పేరును ప్రస్తావించారని, చైర్మన్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని లేఖలో పేర్కొన్నారు కేసీఆర్.

నిబంధనలకు విరుద్ధం

నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని, జూన్ 15 లోపే సమాధానం ఇవ్వాలని అనుకున్నానని, కానీ విచారణ నిష్పక్షపాతంగా లేదని అర్థమైందని తెలిపారు. కమిషన్ ఎదుట తాను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అనుకున్నానని లేఖలో ప్రస్తావించారు కేసీఆర్. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామని తెలిపారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందజేశామని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇది జగమెరిగిన సత్యమని అన్నారు. కరెంట్ కోతలతో మోటార్లు కాలిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే వారని వివరించారు. ఆ కాలంలో జనరేటర్లు, ఇన్వెర్టర్ల కాలమే నడిచిందిని తెలిపారు.

పవర్ హాలీడేలతో పారిశ్రామిక సంక్షోభం

రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందన్న కేసీఆర్, దాని వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయిందన్నారు. రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు కరెంటు కోతలు ఉండేవని తెలిపారు. ‘‘త్రీఫేస్ కరెంట్ కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.89 శాతం ఆంధ్రప్రదేశ్‌కు 46.1 శాతం కేటాయించి ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్‌ను వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వకుండా 1500 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగా ఓట్లు కలిపి 2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది’’ అని వివరించారు

ఇది బెదిరింపా? వివరణా?

లేఖ చివరిలో ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూచించడం హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ మాటలు కమిషన్‌ను బెదిరించేలా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. జరిగిన అక్రమాలపై వివరణ ఇవ్వాల్సింది పోయి బెదిరింపులకు దిగడం కరెక్ట్ కాదంటూ హితవు పలుకుతున్నారు హస్తం నేతలు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు