Bigg Boss Elimination
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: డబుల్.. షాకింగ్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చేసిన నాగ్!

Bigg Boss Telugu 9: ఈ సండే (అక్టోబర్ 12) బిగ్ బాస్ (Bigg Boss Telugu Season 9) వీక్షకులకు మాంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు నాగ్ (King Nagarjuna). ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మరో లాంచింగ్ ఎపిసోడా? అనేలా ఈ సండే ఉండబోతుంది. ఇప్పటికే వచ్చిన ప్రోమోలతో క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్.. తాజాగా మరో ప్రోమోని వదిలారు. ఈ ప్రోమోలో డేంజర్ జోన్ అంటూ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ (Double Elimination) ఉండబోతున్నట్లుగా హింట్ ఇచ్చేశారు. బ్లాక్ స్టార్స్ వచ్చిన వారందరికీ ఓ టాస్క్ పెట్టిన నాగ్.. ఆ టాస్క్‌లో ఓడిపోయిన వారి నుంచి ఒకరిని ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు. దీంతో హౌస్‌లోని వారంతా షాకయ్యారు. ఆల్రెడీ వచ్చిన ప్రోమోలలో ఫ్లోరా శైనీ ఎలిమినేట్ అయినట్లుగా క్లారిటీ రాగా, ఇప్పుడు వచ్చిన ప్రోమోతో డబుల్ ఎలిమినేషన్‌పై బిగ్ బాస్ మరింత క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఈ ప్రోమోలో ఏముందంటే..

Also Read- Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం ఆ ఇద్దరు పండిట్స్! థమన్ స్కెచ్ అదిరింది

స్టిక్ ఇట్ అండ్ విన్ ఇట్

డేంజర్ జోన్ అంటూ వచ్చిన ఈ ప్రోమోలో.. డేంజర్ జోన్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్‌ సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు ఇది మొదటి టాస్క్ అంటూ హోస్ట్ నాగార్జున ‘స్టిక్ ఇట్ అండ్ విన్ ఇట్’ అనే టాస్క్‌ను ఆడించారు. ఒక చార్ట్ బోర్డు పెట్టి, దానికి అక్కడున్న వస్తువులను అతిక్కించే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో పవన్ ఎక్కువగా అతికించినట్లుగా కనిపించారు. మరో టాస్క్‌లో పది వస్తువులను ఇచ్చి, అందులో నుంచి నాలుగు వస్తువులను వాడి, వారికి ఇచ్చిన బీకర్‌లో వేసి, ఎక్కువ స్థాయిలో దానిని నింపాలి. ఈ టాస్క్‌లో కూడా పవన్ గెలిచినట్లుగా తెలుస్తుంది. మరో టాస్క్‌లో గోడకు రౌండ్ చైన్స్ విసిరేలా ఏరేంజ్ చేశారు. ఈ టాస్క్ లన్నింటి తర్వాత శ్రీజ (Srija), సుమన్ శెట్టి (Suman Shetty) డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా కింగ్ నాగ్ ప్రకటించారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. అదేంటంటే..

Also Read- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఫైర్ స్ట్రోమ్.. డే 35 కిక్కే కిక్కు.. అన్‌ప్రిడక్టబుల్ వైల్డ్ కార్డ్స్, ఎలిమినేషన్!

ట్విస్ట్ ఇదే..

హౌస్‌లోకి కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక నిర్ణయం తీసుకుని, మీ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారని నాగార్జున చెప్పారు. శ్రీజ, సుమన్ శెట్టి ఎదురుగా కొన్ని బెలూన్స్ కట్టారు. శ్రీజ ఎదురుగా పసుపు బెలూన్స్ ఉంటే, సుమన్ శెట్టి ఎదురుగా బ్లూ బెలూన్స్ ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వచ్చిన వారు ఆ బెలూన్స్‌ని పగలకొడుతున్నారు. అనంతరం యు ఆర్ ఎలిమినేటెడ్ అంటూ కింగ్ నాగ్ ప్రకటించారు. ఎవరు ఎలిమినేట్ అయిందనేది ఇందులో చూపించ లేదు కానీ, నాగ్ ఆ మాట చెప్పగానే.. మిగతా హౌస్ మెంబర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కళ్యాణ్, సంజన షాక్‌కు గురయ్యారు. కళ్యాణ్‌తో ఎక్కువగా రాసుకుని, పూసుకుని తిరిగేది శ్రీజానే కాబట్టి.. ఆమెనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుంచి బయటకు వచ్చినట్లుగా అర్థమవుతోంది. ఆల్రెడీ ఫ్లోరా, శ్రీజ ఎలిమినేట్ అయినట్లుగా లీక్స్ కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం.. ఫైనల్‌గా ఏం జరగబోతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!