Akhanda 2 Thaandavam
ఎంటర్‌టైన్మెంట్

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం ఆ ఇద్దరు పండిట్స్! థమన్ స్కెచ్ అదిరింది

Akhanda 2: ఫైర్ స్ట్రోమ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) అయిపోయింది.. ఇక థమన్ దృష్టంతా ఇప్పుడు బాలయ్య (Nandamuri Balakrishna) ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 – Thaandavam) పైనే ఉందనే విషయం తెలియంది కాదు. ఆ విషయం సోషల్ మీడియాలో థమన్‌ని ఫాలో అయ్యే వారందరికీ తెలుసు. ‘ఓజీ’లో బ్లాక్ బస్టర్ కొట్టేసిన థమన్.. ఇప్పుడు బాలయ్యతో మరో బ్లాక్ బస్టర్‌కు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ‘ఓజీ’, ‘అఖండ2: తాండవం’ ఒకే రోజు విడుదల కావాల్సి ఉంది. రెండు సినిమాల నిర్మాతలు సెప్టెంబర్ 25న విడుదల అంటూ అధికారికంగా ప్రకటించారు. కానీ, థమన్ కారణంగానే బాలయ్య ‘అఖండ 2’ వాయిదా పడిందని స్వయంగా బాలయ్య బిడ్డ నారా బ్రాహ్మణి, ఓ వేడుకలో ప్రశ్నిస్తున్న వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘ఓజీ’ కోసం ప్రాణం పెట్టేసి, మీసం మెలేసిన థమన్ (S Thaman).. బాలయ్య ‘అఖండ 2’ కోసం ఇంకెంతగా డ్యూటీ చేస్తాడో అని ఫ్యాన్స్ యమా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్‌కు సంబంధించి థమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే..

Also Read- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఫైర్ స్ట్రోమ్.. డే 35 కిక్కే కిక్కు.. అన్‌ప్రిడక్టబుల్ వైల్డ్ కార్డ్స్, ఎలిమినేషన్!

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం ఇద్దరు పండిట్స్

ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ కంపోజర్‌గా పేరొందిన థమన్.. తాజాగా ‘అఖండ 2’ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ప్రారంభించారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిమిత్తం ఇద్దరు పండిట్స్‌ని ఆయన ఈ సినిమాకు యాడ్ చేయబోతున్నారు. వారి వివరాలను తాజాగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. వారు ఎవరో కాదు.. పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా. ఈ ఇద్దరు సోదరులు సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యంలో ప్రసిద్ధి చెందారు. ఈ ప్రతిభావంతులైన సోదరులు ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. థమన్‌ అందించే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో వీరు సంస్కృత శ్లోకాలతో మంత్ర ముగ్ధులను చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ శ్లోకాలు, వేద మంత్రాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెచ్చేలా వుంటాయని, ఈ సినిమాకు థమన్‌ అందిస్తున్న పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరోసారి హై వోల్టేజ్‌ ఎనర్జీ‌తో బాక్సులు బద్దలవడం తధ్యమని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read- Viral Parenting Video: అమ్మాయిలాగా రెడీ అయ్యి.. తన పిల్లలకు ఎలా ఉండాలో నేర్పిస్తున్న కన్న తండ్రి.. వీడియో వైరల్

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో..

‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న నాల్గవ చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ను, నందమూరి నటసింహం బాలయ్య బిడ్డ ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్‌ భారీ బజ్ క్రియేట్ చేసి, సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసిన విషయం తెలిసిందే. బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. హర్షాలి మల్హోత్రా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ చిత్రం 5 డిసెంబర్, 2025న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?