kiran-abbavaram( image :X)
ఎంటర్‌టైన్మెంట్

K Ramp controversy: హీరోలను రిపోర్టర్లు అడిగే ప్రశ్నలు కరెక్టేనా?.. లేదా ప్రమోషన్‌లో భాగమా!..

K Ramp controversy: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కె ర్యాంప్’ ట్రైలర్ ఈవెంట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరో అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. మీడియా సమావేశంలో ఒక మహిళా జర్నలిస్ట్ ప్రదీప్ రంగనాథన్ విషయంపై చర్చించింది. ఇటీవల తమిళ సినిమా ‘డ్యూడ్’ ట్రైలర్ లాంచ్‌లో ఆమె ప్రదీప్‌కు “మీరు హీరోలానే ఉండరు.. రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ హార్డ్ వర్కా లేదా అదృష్టమా?” అని వివాదాస్పద ప్రశ్న వేసింది. దీనికి ప్రదీప్ సాలిడ్ రిప్లై ఇచ్చి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయింది. ఆ జర్నలిస్ట్ ఇప్పుడు తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నాయని వివరణ ఇస్తూ, కిరణ్‌ను “మీరేమంటారు?” అని అడిగింది. కిరణ్ ఏం అన్నారంటే.. “నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అయినా అడగండి పర్లేదు. కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక హీరోని అలా కించపరిచే ప్రశ్నలు అడగడం మంచిది కాదు. దీని వల్ల మనం లోకువ అవుతాము అక్కడి వారికి మీరు నన్ను ఒక మాట అన్నా పడతా. మనం మనం ఒకటి. కానీ పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్లను అలా కించపరచడం కరెక్ట్ కాదు. మీ లుక్స్ ఇలా ఉన్నాయని అడగడం చూసి నాకే చాలా బాధగా అనిపించింది. తప్పగా అనుకోకండి.. ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి.’ అంటూ చెప్పుకొచ్చారు.

Read also-Sai Dharam Tej: అప్పుడు కోమాలోకి వెళ్లాను అని చెప్పలేదు.. చిల్ అవ్వడానికి వెళ్లా అని చెప్పేవాడిని..

పబ్లిసిటీ కోసమా..?

ఈ ఘటన సినిమా ప్రమోషన్‌కు భాగమా లేక సహజంగానే జరిగిందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ చేసుకోవడానికి రిపోర్టర్లతో నిర్మాతలే ఇలాంటి ప్రశ్నలు వేయిస్తున్నారు. మొన్న మంచు లక్ష్మీ వ్యవహారం, నిన్న ప్రదీప్ రంగనాధన్ వ్యవహారం, ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఇలా అన్ని ఈవెంటుల్లోనూ ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది. దీనిని బట్టి చూస్తుంటే నిర్మాతలే దగ్గరుండి ఇలాంటివి చేయిస్తున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆ సందర్భంలో ఏది ఏమైతేనే సినిమాకు ప్రమోషన్ మాత్రం వస్తుంది. నిర్మాతలకు కావాల్సింది అదే. ఇక పాత్రికేయుల విషయానికి వస్తే ఏదో విధంగా పాపులర్ అవ్వాలనే ఇలా అనవసరమైన ప్రశ్నలు వేసి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు. దీంతో నెగిటివ్ గా అయినా సరే సినిమా జనాల్లోకి వెళుతుంది. ఇదంతా స్వ కార్యం స్వామి కార్యం అన్నట్లుగా ఇలాంటి వివాదాల్లో అందరూ లబ్ధి పొందుతున్నారు ప్రేక్షకుడు తప్ప. మరి ఇలాంటి కాంట్రవర్సీలకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి మరి. ‘కె-ర్యాంప్’ ట్రైలర్ లాంచ్ సమయంలో ఇలాంటి కాంట్రవర్సీ వచ్చడం సినిమాకు ఫ్రీ పబ్లిసిటీగా పనిచేస్తుంది. ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది, ఈ ‘రిప్లై’ వీడియోలు కూడా మిలియన్ల వ్యూస్ సాధించే అవకాశం ఉంది. తెలుగు సినిమా ప్రమోషన్లలో ఇలాంటి ‘స్పైసీ’ మూమెంట్స్ సాధారణం. ఉదాహరణకు, ప్రదీప్ రంగనాథన్ స్వయంగా ‘డ్యూడ్’ ప్రమోషన్‌లో రిప్లై ఇచ్చి బజ్ క్రియేట్ చేశారు.

Read also-Peddi leaked video: మళ్లీ నెట్‌లో హల్ చల్ చేస్తున్న ‘పెద్ది’ షూటింగ్ వీడియో.. ఇదంతా నిర్మాతల పనేనా?

ముగింపు

పాజిటివ్ మెసేజ్‌తో ప్రమోషన్ అంతటా కాకుండా, ఈ ఘటన తెలుగు మీడియా పట్ల ఒక మంచి సందేశం ఇచ్చింది. ప్రశ్నలు అడగాలి, కానీ గౌరవంతో. ఈ కాంట్రవర్సీ సినిమాకు బూస్ట్ ఇస్తుందని అంచనా, కానీ కిరణ్ స్పందన సహజమేనా అనేది అతని ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉంది. కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘కె-ర్యాంప్’ (K-Ramp) సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రాబొతున్న ఈ సినిమాలో పంజాబ్‌కు చెందిన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. దర్శకుడు జైన్స్ నాని డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?