John Wesley: బీసీ రిజర్వేషన్లపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు
John Wesley (imagecredit:twitter)
Telangana News

John Wesley: బీసీ రిజర్వేషన్లపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి: జాన్ వెస్లీ

John Wesley: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ అమలు విషయంలో హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని సీపీఐ(ఎం)(CPIM) తెలంగాణ రాష్ట్రకమిటీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లి(John Wesley) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఓ మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి, శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును రూపొందించి కేంద్రానికి పంపిస్తే, ఆరు నెలలైనా రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. గతంలో కొన్ని తీర్పులలో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం రాష్ట్రపతి అయినా సరే మూడు నెలల్లోగా తేల్చాలి, లేదా వెనక్కి పంపించాలి. కానీ ఇది జరగలేదు.

9వ షెడ్యూల్లో..

మూడు నెలలు పూర్తయినందున చట్టంగా తీసుకోవచ్చని సుప్రీంకోర్టు(Supreme Court) చెప్పినందున 42 శాతం రిజర్వేషన్స్‌ అమలు చేసుకునే అవకాశం ఉందన్నారు. అలా సాధ్యం కాకపోతే, మొత్తం బీసీ(BC)ల రిజర్వేషన్స్‌ మీద కేంద్ర ప్రభుత్వంతో పోరాడి బిల్లును అమలు చేసే విధంగా 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా పోరాటం సాగించాలన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించడం కోసం ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. అఖిలపక్షం తీసుకున్న ఉద్యమానికి సీపీ(CPM)ఎం పూర్తిగా మద్దతిస్తుందన్నారు.

Also Read: Bhatti Vikramarka: గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ విద్యుత్.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

కేంద్రంమీద మీద ఒత్తిడి..

రాష్ట్రంలో బీజేపీ(BJP)కి 8 మంది ఎంపీ(MP)లు, ఇద్దరు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌కు అనుకూలంగా మాట్లాడుతూ, కేంద్రంలో మాత్రం వ్యతిరేకంగా ఉంటున్నదన్నారు. కేంద్రంమీద మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, ఆ పార్టీ ఎంపీలు, మంత్రుల మీద ఉంది. అమలు జరగకపోతే వారే బాధ్యత వహించి రాజీనామాలు చేయాలన్నారు. బీజేపీ మనువాద పార్టీ, రిజర్వేషన్లకు వ్యతిరేకమైన పార్టీ. బీజేపీ ఇదే వైఖరి కొనసాగిస్తే రాష్ట్రంలో జూబ్లిహిల్స్‌(Jublihills), స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలు జరిగినా బీజేపీకి ఓట్లు వేయకుండా సామాజిక తరగతులన్ని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తున్నదన్నారు.

Also Read: Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు.. రూ. కోటి విలువైన డ్రగ్స్‌ స్వాధీనం!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..