k-ramp-trailer( image :X)
ఎంటర్‌టైన్మెంట్

K Ramp trailer: ‘కె ర్యాంప్’ ట్రైలర్ వచ్చేసింది.. పాపం లవ్ కుమార్‌కు ర్యాంపే..

K Ramp trailer: టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘కె ర్యాంప్’ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. జైన్స్ నాని దర్శకత్వంలో రొమేంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ జానర్ లో ఈ సినిమా రాబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా కనిపించనున్నారు. సాయికుమార్, మురళీధర్ గౌడ్ వంటి సీనియర్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో ఉన్నారు. నిర్మాణం హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది.

Read also-Peddi leaked video: మళ్లీ నెట్‌లో హల్ చల్ చేస్తున్న ‘పెద్ది’ షూటింగ్ వీడియో.. ఇదంతా నిర్మాతల పనేనా?

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.త్రివిక్రమ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన మూడో సింగిల్ ‘టిక్కల్ టిక్కల్’ లిరికల్ వీడియో యూత్‌కి సూపర్ హిట్ అయింది. టైటిల్ సాంగ్ కూడా ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. స్క్రిప్ట్ ప్రకారం 18 ముద్దు సీన్లు ఉండాలని ప్లాన్ చేశారు, కానీ ఫైనల్‌లో 16కి తగ్గించారట. దీనిని చూస్తుంటే మూవీలోని బోల్డ్ ఎలిమెంట్స్‌కి బాగా ఎలివేట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. హీరో కాంట్రవర్సీలు కూడా సినిమాకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Jr NTR: బావమరిది వివాహంలో ఎన్టీఆర్ సందడి.. పిక్స్ వైరల్..

విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే.. కిరణ్ అబ్బవరం కాళ్లు ఒణకడంతో మొదలవుతుంది. అది తన గర్లఫ్రెండ్ పెట్టే టార్చర్ తట్టుకోలేక. బాగా డబ్బున్న కిరణ్ అబ్బవరం ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. వాళ్ల అమ్మ లేదన్న సింపతీతో చిన్ననాటి నుంచీ అల్లారు మద్దుగా పెరుగుతాడు. కాలేజీలో ఉండగా ఓ అమ్మాయిని ప్రేమించే క్రమంలో హీరోయిన్ తో ‘అబ్బవరం ఇస్తా వరం’ అంటూ ఆమె వెనకాల తిరిగి ఆమెను పడేస్తాడు. తర్వాత ఆమె టార్చర్ తట్టుకోలేక ఏం చేశాడు అన్నది స్టోరీ గా తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడుతుందనే చెప్పాలి. ట్రైలర్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో నడుస్తోంది. అక్కడక్కడా డబల్ మీనింగ్ డైలాగులు ఉన్నా టీజర్ మీద పర్లేదనే అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజాలు టాప్ నాచ్ పర్ఫామెన్స్ అందించారు. నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్స్ సరిగ్గా సరిపోయాయి. సంగీతం అయితే హీరో ఎనర్జీకి ఎక్కడా తగ్గకుండా అందించారు. ఓవరాల్ గా ఈ టీజర్ చూస్తుంటే మంచి ఎంటర్ టైనింగ్ తో సాగింది. ఇక సినిమా కోసం వేచి ఉండాల్సిందే.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!