TG High Court (Image Source: Twitter)
తెలంగాణ

TG High Court: స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ మెలిక పెట్టిన హైకోర్టు.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సర్కార్!

TG High Court: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.9 అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ను సైతం నిలుపుదల చేస్తూ అక్టోబర్ 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తీర్పు సంబంధించిన కాపీని శుక్రవారం అర్ధరాత్రి హైకోర్టు విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కీలక సూచనలు చేసింది. ఓ షరతు మీద ఎన్నికల నిర్వహణకు సైతం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.

హైకోర్టు కాపీలోని కీలక అంశాలు..

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మెుహియుద్దీన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రెండ్రోజుల పాటు విచారణ జరిపింది. పిటిషనర్ల వాదన అనంతరం తాము ఇచ్చిన తీర్పు వివరాలను.. తాజాగా విడుదల చేసిన కాపీలో డివిజన్ బెంచ్ స్పష్టంగా తెలియజేసింది. ఈ కాపీ ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.9 తో పాటు జీవో 41, జీవో 42ల అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

రిజర్వేషన్ల లిమిట్‌కు తూట్లు

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవో.. సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్దంగా ఉన్నట్లు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఇందిరా సాహ్ని (మండల్ కమిషన్) తీర్పులో నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించిందని.. అదే సమయంలో ‘వికాస్ కిషన్ రావు కేసు’కు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాలకు సైతం విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ ను సైతం (50 రిజర్వేషన్లపై పరిమితి).. తాజా జీవోల్లో ఉల్లంఘించినట్లు తేల్చి చెప్పింది.

ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్..

అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించిన హైకోర్టు.. తాజా కాపీలో తన నిర్ణయాన్ని సవరించుకుంది. రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకుండా.. కావాలంటే పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికే హైకోర్టు వదిలేసింది. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమీషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే అక్టోబర్ 9న వచ్చిన తీర్పుపై స్పందిస్తూ తాము హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు ఎస్ఈసీ ప్రకటించడం గమనార్హం.

Also Read: CMD Musharraf Farooqui: వచ్చే సమ్మర్‌లో విద్యుత్ డిమాండ్ పై యాక్షన్ ప్లాన్.. కీలక అంశాలపై చర్చ!

సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్?

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుకు సంబంధించి పూర్తి కాపీ బయటకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలో పడింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్నందున సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక విచారణ జరిపించి.. ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Medical Scam: భాగ్యనగరంలో రూల్స్‌కు విరుద్ధంగా స్పెషాలిటీ క్లినిక్‌లు

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?