Kavitha ( image credi: twitter)
తెలంగాణ

Kavitha: జాబ్ క్యాలెండర్ హామీ అమలయ్యే వరకు ఒత్తిడి చేస్తాం.. కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ప్రజలను పూర్తిగా వదిలేశారని, జీవో 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు. జీవో 29 రద్దు అయ్యే వరకు కంప్లీట్ గా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోనే కాదు.. జిల్లాలు, ఊర్లు, గ్రామాలకు వెళ్లి పోరాటం చేస్తామన్నారు.  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గ్రూప్-1 అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మన పిల్లల్ని బాధపెట్టే విధంగా ప్రభుత్వాలు ఉండకూడదని, ఏదైనా పొరపాటు జరిగితే సరిచేసుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చాక 10ఏళ్లలో కేసీఆర్ (KCR) విద్యార్థుల కోసం చేయాల్సినంత చేశారని, కానీ దురదృష్టవశాత్తు గ్రూప్-1 పరీక్ష నిర్వహించుకోలేకపోయామన్నారు. కానీ గత ప్రభుత్వం ఎప్పుడు విద్యార్థుల మీద కోపం పెట్టుకోలేదన్నారు.

Also Read: Kavitha: ఆదివాసీల హక్కుల కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం.. కవిత కీలక వ్యాఖ్యలు

6 నెలలుగా ఈ ప్రభుత్వ వైఖరి

ఈ ప్రభుత్వం మాత్రం విచిత్రంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల మీద కూడా కేసులు పెడుతోందని ఆరోపించారు. గ్రూప్-1 ఇష్యూను నేను ఒక తల్లి కోణంలో చూస్తున్నానని, ఒక కుటుంబంలో ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. ఈ ముఖ్యమంత్రి మాటకారి ఆయన చేయాల్సి పని చేయకుండా ప్రతిపక్షాలను తిడుతున్నారని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం లు విద్యార్థుల సమస్యలపై మాట్లాడకుండా వారిని అవమానిస్తున్నారన్నారు. తెలంగాణ బిడ్డలమైనా మనం ఆకలైనా భరిస్తాం, కానీ అవమానాన్ని భరించమన్నారు. గత 6 నెలలుగా ఈ ప్రభుత్వ వైఖరిని చూస్తున్నామని, ఇక లాభం లేదని పోరాటానికి సిద్దమయ్యామన్నారు. గ్రూప్-1 కు సంబంధించి వారం రోజుల పాటు పోరాటాలు చేస్తామన్నారు. శుక్రవారం అశోక్ నగర్ లో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చేసే పోరాటంలో కచ్చితంగా న్యాయపోరాటానికి మేము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

గ్రూప్-1 రిజల్ట్ చివరికంటా పోరాటం చేయాలి 

గ్రూప్ -1 నియామకాలు రద్దు చేసి తిరిగి ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని, గ్రూప్-1 రిజల్ట్ చివరికంటా పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ అమలయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించామన్నారు. 2లక్షల ఉద్యోగాల పూర్తి స్తాయిలో ఇచ్చే వరకు ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. టీజీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే విధంగా ఉన్న జీవో 29 ను రద్దు చేయాలని మొత్తం ఐదు తీర్మానాలను చేశామన్నారు. ఈ తీర్మానాలను గవర్నర్, సీఎంలకు పంపిస్తామన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: MLC Kavitha: కవిత రాజకీయ ఎత్తుగడలు అక్కడి నుంచే..? ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!