Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె ఎనిమిది గంటల పని విషయంలో వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిఫలంగా రెండు బడా ప్రాజెక్టుల నుంచి కూడా ఆమెను తప్పించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 ఏడి’ సీక్వెల్ నుంచి ఆమెను తప్పించారు. ఓ ప్రముఖ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై స్పందించారు. దీని గురించి ఆమె ఏం అన్నారంటే.. మహిళగా ఇప్పటి వరకూ వేరు ప్రస్తుతం నేను ఇక బిడ్డకు తల్లిని నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నేను అడిగింది తప్పు అని భావించడంలేదు. ఎందుకు అంటే నా అవసరాలు అలాంటివి. అందుకే ఎనిమిది గంటలు పని అన్నది. అయితే ఈ ఎనిమిది గంటల సూత్రం ఎప్పటినుంచో అమలులో ఉంది. భారత దేశంలో చాలా మంది సూపర్ స్టార్స్ కొన్ని దశాబ్దాలుగా ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తున్నారు. అని అన్నారు.
Read also-HBD Rajamouli: జక్కన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. ఎవరెవరు ఏం అన్నారంటే..
అంతే కాకుండా.. ‘భారతీయ సినిమా పరిశ్రమ ఓ ప్రణాళిక లేనిది. నేను ఎప్పుడూ ఇండస్ట్రీలో పనిచేయలేదు. సినిమా అనేది ఒక కల్చర్ అందులో పని చేశా సిస్టమ్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి ఆలోచించండి అని చెప్పుకొచ్చారు. ఇక అప్పుడు ఎందుకు స్పందించలేదు అని అడగ్గా.. నేను ప్రతి విషయం లోనూ సైలెంట్ గా ఉంటాను. ఈ విషయంలో కూడా అంతే నాకు మాట్లాడాలి అనిపించలేదు అందుకే ఏం చెప్పలేదు అని చెప్పుకొచ్చారు. పని గంటల విషయంలో చాలా మంది పేర్లు నాకు తెలుసు. వారందరూ ఎనిమిది గంటలే పని చేస్తారు. వారానికి అయిదు రోజులే చేస్తారు వారాంతాల్లో పని చేయరు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు అది అవసరంలేదు. అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Prabhas leaked video: ‘ది రాజాసాబ్’ నుంచి వీడియో వైరల్.. ఇక లాఫింగ్ జాతరే..
ఈ నిర్ణయం దీపికా కోసం కష్టమైనది కావచ్చు, కానీ ఆమె తన మూలాలకు నిలబడింది. దీపికా మాటలు భారతీయ సినిమా పరిశ్రమలో మార్పులను సూచిస్తున్నాయి. మహిళలు పని, కుటుంబం మధ్య సమతుల్యత కోరుకోవటం సహజమే. పురుష నటులు ఇది చేస్తున్నప్పుడు వార్తలు రాకపోవటం డబుల్ స్టాండర్డ్‌ను చూపిస్తుంది. దీపికా ఈ విషయాన్ని బలంగా లేవనెత్తడం ప్రశంసనీయం. ఈ వివాదం పరిశ్రమలో షెడ్యూలింగ్, వర్క్ అవర్స్ గురించి చర్చలకు దారితీస్తుందని ఆశ. దీపికా రాబోయే సినిమాలు ‘కల్కి’ సీక్వెల్ నుంచి తీసివేసిన తర్వాత కొన్ని రోజుల్లోనే దీపికా ‘కింగ్’ షూటింగ్ ప్రారంభించింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో షా రుఖ్ ఖాన్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్‌లతో ఈ సినిమా. అల్లు అర్జున్‌తో ఆట్లీ డైరెక్షన్ లో ‘AA22xA6’ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఈ ప్రాజెక్టులు దీపికా కెరీర్‌కు కొత్త ఊపు ఇస్తాయి.
Many heroes work out for 8 hours a day just to look fit. But when a heroine does the same, people call it a big issue.” – Deepika Padukone#Sprit #DeepikaPadukone pic.twitter.com/In88mqRCRS
— let's x Cinematica (@letsxCinematica) October 10, 2025
