Ramchander Rao (imagecredit:swetcha)
Politics, తెలంగాణ

Ramchander Rao: మీ తప్పిదం వల్ల బీజేపీని బద్నాం చేయొద్దు: రాంచందర్ రావు

Ramchander Rao: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం జారీ చేసిన జీవో(GO)పై తెలంగాణ హైకోర్టు(Telangan High Cort) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchnder Rao) డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు కేసును వాయిదా వేసిందని, కోర్టు స్టే విధించడానికి కారణం కాంగ్రెస్(Congress) ప్రభుత్వ నిర్ణయాలే కారణమని విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నదని మండిపడ్డారు.

గవర్నర్‌కు బిల్లు..

నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. బీసీ(BC)లకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్‌కు బీజేపీ(BJP) సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య(BJP MP R Krishnaiah) ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేశారని తెలిపారు. గవర్నర్‌కు బిల్లు పంపించి మూడు నెలలు కూడా అవ్వలేదని, ప్రభుత్వం ఏమాత్రం ఓపిక పట్టలేదని ఫైరయ్యారు. జీవో(GO) ఇచ్చి షెడ్యూల్ ప్రకటించడం వెనుక ఉన్న మతలబు ఏంటని రాంచందర్ రావు ప్రశ్నించారు. కేవలం బీజేపీని బద్నాం చేసేందుకే ఈ నాటకాలని విరుచుకుపడ్డారు.

Also Read: Andhra Pradesh: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?

హైకోర్టులో పిటిషన్లు వేసినవారు..

హైకోర్టు స్టే కు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాజకీయ స్వలాభం కోసం బీసీ(BC)ల హక్కులను కాంగ్రెస్ ఫణంగా పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసినవారు కాంగ్రెస్‌కు చెందినవారేనని ఆరోపించారు. మరోవైపు, సినీ నటుడు జేఎల్ శ్రీనివాస్(JL Srinivass), మాజీ సైనికుడు, బ్యాంక్ రిటైర్డ్ అధికారి జీఎల్ కృష్ణారావు, భగవద్గీత ఫౌండేషన్ సీఈవో స్వాతి మీనన్(Swathi Menan) నాంపల్లి కార్యాలయంలో రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు.

Also Read: Upendra re release: కల్ట్ క్లాసిక్ ‘ఉపేంద్ర’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండగే..

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?