Paddy-Procurement
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Paddy procurement: ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమైన ప్రభుత్వం.. ఈసారి చాలా పకడ్బందీగా!

Paddy procurement: 17 జిల్లాలో ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు

ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా
చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ ఏర్పాటు
సుమారు 12కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధం
8332కొనుగోలు కేంద్రాల్లో 700 స్టార్ట్
వరికోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నిత్యం మానిటరింగ్ చేస్తున్న సివిల్ సప్లయి అధికారులు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు (Paddy procurement) పకడ్బందీ చర్యలు చేపడుతోంది. అందుకోసం కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభిస్తోంది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణకు రాకుండా ప్రణాళికలు రూపొందించింది. ఇతర రాష్ట్రాల కంటే దొడ్డువడ్లకు క్వింటాకు రూ.2,389 ఇస్తుండటం, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం వచ్చే అవకాశం ఉంది. గతంలో కొన్ని ఆరోపణలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్రమధాన్యం రవాణాను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపడుతుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న 17 జిల్లాల్లో 56 ఇంటర్-స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ ఏర్పాటు చేసి, ఆకస్మిక తనిఖీలు చేస్తూ కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సివిల్ సప్లయి ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, పోలీసు శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు.

Read Also- BC Reservations: బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో వానాకాలం 67.57 లక్షల ఎకరాలలో వరి సాగు అయింది. అందులో సన్నాలు 40.75 ఎకరాలలో, దొడ్డు రకం 26.82 లక్షల ఎకరాలలో సాగు అయింది. 90.46 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు, 57.84 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం మొత్తం 148.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకోసం 8,332 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఇప్పటికే 700 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు 21,112 కోట్లు అవుతుందని ప్రణాళికలు రూపొందించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 4,252, ఐకేపీల ద్వారా 3,522, ఇతరుల ఆధ్వర్యంలో 558 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

Read Also- GHMC: హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం.. నీరు సాఫీగా వెళ్లేందుకు.. జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్!

గన్నీ బ్యాగుల కొరత రాకుండా అన్ని చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లకు మొత్తం 18.75 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం, కాగా 12కోట్ల బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన వాటికి ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలిపారు. మిల్లర్ల దగ్గర కూడా గన్నీ బ్యాగులు ఉన్నాయని, కాంటా వేసిన వెంటనే రవాణాకు ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షణ చేయనున్నారు. అందుకోసం ప్రత్యేక టీమ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపులు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులు మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సెంటర్ల వద్దనే ధాన్యం అప్పగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లలోనే ట్రక్ షీట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్ముకున్న తరువాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదు. ధాన్యం మిల్లులకు తరలించే బాధ్యతతో పాటు మిల్లుల్లో ధాన్యం దించుకునేది వీటన్నింటికీ రైతులకు ఎలాంటి సంబంధం ఉండదు. మిల్లింగ్ సామర్థ్యం, సీఎంఆర్ వేగం బట్టి ధాన్యం కేటాయింపులు ఉంటాయి. ప్యాడీ అలోకేషన్ పారదర్శక కేటాయింపు విధానాన్ని అమలు చేస్తున్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో ఆటోమేటిక్ ప్యాడీ డ్రయర్లు, క్లీనర్లను సివిల్ సప్లయ్స్ శాఖ తొలిసారి అమలు చేస్తుందని సివిల్‌ సప్లై శాఖ డైరెక్టర్‌ హనుమంత్‌ కె.జెండగే తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!