Panjaram Trailer
ఎంటర్‌టైన్మెంట్

Panjaram Trailer: ఒక కథ చెబుతా వింటారా? కానీ భయపడకండి!

Panjaram Trailer: సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ సంయుక్తంగా.. సాయి కృష్ణ దర్శకత్వంలో ఆర్ రఘన్ రెడ్డి (R Raghan Reddy) నిర్మిస్తోన్న చిత్రం ‘పంజరం’ (Panjaram). అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతా కొత్త వాళ్లు చేసిన ఈ హారర్ మూవీ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు సాయి కృష్ణ (Sai Krishna) ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నాకు ఈ జర్నీలో సహకరించిన అందరికీ థాంక్స్. మోహన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. ఆర్ఆర్, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రానికి అంతా కొత్తవారు పని చేశారు. పని చేసిన ప్రతీ ఒక్కరూ ఫ్యూచర్‌లో పెద్ద స్టార్స్ అవుతారు. ప్రదీప్ అన్న ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించారు. పద్మ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రమణ, సురేష్, ప్రదీప్.. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఇందులో నటించిన యువ నటీనటులు మంచి స్టార్స్ అవుతారు. వారంతా ఎంతగానో సహకరించారు. చాలా కొత్తగా ట్రై చేశాం. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. మా సినిమాకు ఆడియెన్స్‌తో పాటు మీడియా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Bigg Boss Telugu 9: డే 32.. ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్, అవుటాఫ్ రేస్.. టార్గెట్ సంజన!

వెన్నులో వణుకు పుట్టించేలా..

ట్రైలర్ (Panjaram Trailer) విషయానికి వస్తే.. ‘ఒక కథ చెబుతా వింటారా? కానీ భయపడకండి’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. ఎందుకు అందరూ పేదరాసి పెద్దమ్మ పేరు చెబితే భయపడుతున్నారు, ఊర్లో జరుగుతున్న హత్యల గురించి మీకు ఏమైనా తెలుసా?, ఒక్కసారి దాని పంజరంలో పడితే.. తెలియకుండానే దాని పంజరంలో చిలకవి అయిపోతావ్.. అనే డైలాగ్స్‌తో ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ఎమోషన్ అద్భుతంగా పండింది. అంతా కొత్తవారు అయినా, ఆ ఫీలింగ్ రాలేదంటే, ఈ సినిమా కోసం వారు ఎంతగా వర్క్ చేశారో ఊహించుకోవచ్చు. అలాగే రియల్ లొకేషన్స్‌లో సినిమాను చిత్రకరీంచిన విషయం ప్రతి ఫేమ్‌లో అర్థమవుతోంది. మొత్తంగా అయితే, చాలా కొత్తగా ఉండటమే కాకుండా.. వెన్నులో వణుకు పుట్టించేలా ఈ ట్రైలర్ ఉందని చెప్పుకోవచ్చు. పేదరాసి పెద్దమ్మ, ఊరుని చూపించిన తీరు, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. సాంకేతికంగా కూడా ‘పంజరం’ హై స్థాయిలో ఉంది. ట్రైలర్‌లో చివరి షాట్ నవ్విస్తూనే సింపుల్‌గా భయపెట్టించేలా ఉంది. హారర్ ప్రియులకు మాత్రం పండగే అనేలా ట్రైలర్‌ని కట్ చేశారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Panjaram Movie Team

Also Read- Gatha Vaibhava: పవన్ కళ్యాణ్ అద్భుతమైన మాట చెప్పారు.. అందుకే తెలుగు నేర్చుకుని వచ్చానన్న హీరో!

మ్యూజిక్ అదిరిపోతుంది

ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో యువతేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను మల్లి అనే పాత్రలో నటించాను. నా పాత్ర, లుక్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. దర్శకుడు సాయి ఈ మూవీని గొప్పగా తీశారు. అనిల్ నాకు చిన్ననాటి స్నేహితుడు. రూప, ముస్కాన్‌లవి చాలా మంచి పాత్రలు. నాని అన్న మ్యూజిక్ అదిరిపోతుంది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఇంకా అనిల్, రూప, ముస్కాన్, మ్యూజిక్ డైరెక్టర్ నాని మోహన్, ఇతర ఆర్టిస్ట్‌లు ఈ సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!