Sarpanch's Salary (Image Source: AI)
తెలంగాణ

Sarpanch’s Salary: సర్పంచ్ వేతనం ఇంత తక్కువా? మరి రూ. కోట్లల్లో ఖర్చు పెట్టి.. ఎన్నికల్లో పోటీ ఎందుకు!

Sarpanch’s Salary: తెలంగాణలో స్థానిక ఎన్నికల జోష్ మెుదలైంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ఈసీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎప్పటిలాగే ఈసారి కూడా సహజంగానే సర్పంచ్ జీతభత్యాల అంశం తెరపైకి వచ్చింది. గ్రామంలో ప్రథమ పౌరుడు, సూపిరియర్ గా ఉండే సర్పంచ్ జీతం ఎంత? అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా మెుదలైంది. అంతేకాదు సర్పంచ్ గా గెలవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ? అసలు ఎన్నికల్లో పోటీకి కావాల్సిన అర్హతల ఏంటీ? వంటి విషయాలు తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ కు సంబంధించిన కీలక విషయాలను ఇప్పుడు చూద్దాం.

సర్పంచ్ గా పోటీకి అర్హతలు..

ప్రజా ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే రాజ్యాంగం, చట్ట ప్రకారం కొన్ని అర్హతలు తప్పనిసరి. కాబట్టి సర్పంచ్ కు సైతం కొన్ని అర్హతలను నిర్దేశించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018లోని సెక్షన్స్ 9, 17.. సర్పంచ్ కు ఉండాల్సిన కొన్ని అర్హతలు సూచించింది. ఎన్నికల్లో పోటీకి 21 ఏళ్ల కనీస వయసు, గ్రామంలో ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలని సూచించింది. అలాగే 1995 మే 31 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగి ఉంటే సర్పంచ్ గా పోటీకి అనర్హులు. ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే సర్పంచ్ గా తలపడాల్సి ఉంటుంది. సర్పంచ్ గా పోటీకి ఎలాంటి విద్యార్హత నిర్ధేంచలేదు. ఇవి కాకుండా భారతీయ పౌరుడై ఉండటం, క్రిమినల్ కేసుల్లో శిక్ష పడి లేకపోవడం, ప్రభుత్వం ఉద్యోగి కాకపోవడం వంటివి ఇతర అర్హతలుగా నిర్ణయించబడ్డాయి.

జీత భత్యాలు..

సర్పంచ్ జీత భత్యాలకు సంబంధించి రాష్ట్ర విభజన అనంతరం 2015లో తెలంగాణ ప్రభుత్వం జీవో నెం.53 విడుదల చేసింది. అయితే అందులో చెప్పిన వేతనాలను 30 శాతం మేర పెంచుతూ మరోమారు ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ లకు రూ. 5000-7000 చెల్లిస్తున్నారు. అయితే చాలా వరకూ సర్పంచ్ లు.. సగటున రూ. 6500 గౌరవ వేతనంగా పొందుతున్నారు.

సర్పంచ్ సౌకర్యాలు

సర్పంచ్ గ్రామానికి తొలి పౌరుడిగా పరిగణించబడతాడు. గ్రామానికి సంబంధించి రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, పన్ను వసూళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని సర్పంచ్ కనుసన్నల్లో జరుగుతుంటాయి. ఆయన సంతకం లేనిదే నిధులు విడుదల చేయడం గానీ, ఖర్చు చేయడం గానీ కుదరదు. సామాజికంగానూ సర్పంచ్ ను గ్రామస్తులు ఎంతగానో గౌరవిస్తారు. ఊరిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా ఆయన్ను గ్రామపెద్దగా ఆహ్వానిస్తుంటారు. కుటుంబ తగాదాల పరిష్కారించడంలోనూ సర్పంచ్ కీలక పాత్ర పోషిస్తుంటాడు.

Also Read: Jamaat-ul-Mominaat: మసూద్ మాస్టర్ ప్లాన్.. భారత్‌పైకి మహిళా ఉగ్రవాదులు.. ఆత్మాహుతి దాడులకు కుట్ర!

సర్పంచ్ బాధ్యతలు..

పాలనాపరంగా సర్పంచ్ కు ఎన్నో అధికారులు ఉంటాయి. గ్రామ పంచాయతీ సభలు నిర్వహించడం, గ్రామసభల్లో పాల్గొని అభిప్రాయాలు చెప్పడం, అత్యవసర తీర్పులు వెలువరించడం వంటివి సర్పంచ్ కు ఉన్న విశేషాధికారాలు. వీటితో పాటు గ్రామంలోని రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్ల నిర్వహణ, ప్రభుత్వ స్కీములు, ఆరోగ్యం, విద్య, వ్యవసాభివృద్ధికి సంబంధించిన పనుల పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్ పై ఉంటుంది. పంచాయతీ కార్యదర్శితో సమన్వయం చేసుకొని.. ఊరి సమస్యలను రిపోర్టుల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కూడా సర్పంచ్ ముఖ్యమైన బాధ్యత. సర్పంచ్ పదవికి ఇన్ని విశేష అధికారులు, బాధ్యతలు ఉన్నాయి కాబట్టే.. ప్రభుత్వం ఇచ్చే వేతనంతో సంబంధం లేకుండా.. ఎన్నికల్లో ఎంతైన ఖర్చు చేసి గెలవాలని పలువురు అభ్యర్థులు భావిస్తుంటారు.

Also Read: Qatar Airways: 85 ఏళ్ల శాకాహారికి.. నాన్ వెజ్ పెట్టిన విమాన సిబ్బంది.. తర్వాత జరిగింది ఇదే!

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..