Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైటిల్ పై ఇప్పటికే బజ్ నెలకొంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిని పోలిన పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ క్రమంలో సినిమా టైటిల్ కూడా ‘వారణాసి’గా దర్శకుడు కన్ఫామ్ చేశాడని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అసలే రాముడిలా ఉంటాడంటూ ఊహించుకునే మహేష్ ఫ్యాన్ వారణాసి పేరుకు ఫల్ సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి నిర్మాతలు, దర్శకుడు కానీ అధికరికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్ నవంబర్ లో రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రియాంక చోప్రా, మహేష్ బాబులతో షూటింగ పూర్తయిందని వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా అప్టేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.
Read also-Srinivas Goud: బీసీరిజర్వేషన్లుకు చట్టబద్దత కల్పించాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
‘SSMB29’ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలతో కూడిన ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది సూపర్‌స్టార్ మహేష్ బాబు 29వ సినిమాగా రూపొందుతోంది. అందుకే SSMB29 అని ప్రాజెక్ట్ పేరు. డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి హిట్‌ల తర్వాత ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు. ఈ సినిమా అధికారిక టైటిల్ “వరానాసి”గా ప్రచారం అవుతోంది. ఇది పురాతన నగరం వారణాసి ఆధ్యాత్మిక సాంస్కృతిక మూలాల నుండి ప్రేరణ పొందింది.
ఈ చిత్రం యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది. మిథాలజీ, ప్రకృతి, ఎక్స్‌ప్లోరేషన్‌ను కలిపి అడ్వెంచర్‌గా రూపొందించబడింది. కథాంశం ప్రకారం, ఒక పురావస్తు శాస్త్రవేత్త (మహేష్ బాబు పాత్ర) లార్డ్ హనుమంతుని లక్షణాలతో కూడినవాడు, అమెజాన్ అడవులు ఆఫ్రికా భాగాల్లో ప్రపంచవ్యాప్త అడ్వెంచర్‌కు పయనిస్తాడు. భవిష్యత్తు భాగ్యం ఆయనకు మరిన్ని రహస్యాలను వెల్లడి చేస్తుందని చెబుతున్నారు. మహాభారతం నుండి ప్రేరణలు తీసుకుని, మహేష్ బాబు ఒక కొత్త అవతారంలో కనిపిస్తాడు. పాన్-వరల్డ్ ఫిల్మ్‌గా, తెలుగులో తీస్తున్నప్పటికీ పాన్-ఇండియా రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విశేషాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.
