Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై (Local Body Elections) ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, హైకోర్టు నుంచి పూర్తిస్థాయిలో ఉత్తర్వులు వెలువడకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఇంకా కొంత సందిగ్ధత నెలకొంది. అయినప్పటికీ, ఎన్నికల అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ (నేడు) ఉదయం విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 21 జడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాలకు, వికారాబాద్ జిల్లాలో 20 జడ్పీటీసీ, 227 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై నేటికి వాయిదా పడ్డ విచారణ.. లైన్ క్లియర్ అయినట్టేనా?
దశ రంగారెడ్డి జిల్లా స్థానాలు వికారాబాద్ జిల్లా స్థానాలు నామినేషన్ల ప్రారంభం పోలింగ్ తేదీ
మొదటి దశ 10 జడ్పీటీసీ, 110 ఎంపీటీసీ 11 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ నేటి నుంచి (అక్టోబర్ 9) అక్టోబర్ 23
రెండవ దశ 11 జడ్పీటీసీ, 120 ఎంపీటీసీ 9 జడ్పీటీసీ, 112 ఎంపీటీసీ అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 27
నామినేషన్లు, ఓటర్ల సంఖ్య..
మొదటి దశలో నామినేషన్లకు అక్టోబర్ 11 చివరి గడువు కాగా, అక్టోబర్ 12న పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 15 మధ్యాహ్నం వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చి, సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. రెండవ దశలో నామినేషన్లు అక్టోబర్ 15తో ముగుస్తాయి. ఉపసంహరణకు అక్టోబర్ 19 మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చి, సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు. ఈ రెండు దఫాల్లో జరిగే పోలింగ్‌లో రంగారెడ్డిలో 7,52,259 మంది, వికారాబాద్‌లో 6,98,472 మంది ఓటర్లు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మొత్తం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను నవంబర్ 11వ తేదీన లెక్కించనున్నారు.
మొదటి దశలో జరిగే ప్రాంతాలు..
జిల్లా మండలాల పరిధి
రంగారెడ్డి చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, కందుకూర్, మహేశ్వరం, కడ్తాల్, అమన్‌గల్లు, తలకొండపల్లి, శంషాబాద్.
వికారాబాద్ కొడంగల్, దౌల్తాబాద్, బోంరాస్‌పేట్, దుద్యాల్, బంట్వారం, వికారాబాద్, మర్పల్లి, ధారూర్, మొమిన్‌పేట్, నవాబ్‌పేట్, కొట్పల్లి.
రెండవ దశలో జరిగే ప్రాంతాలు
జిల్లా మండలాల పరిధి
రంగారెడ్డి ఫారూక్‌నగర్, కొత్తూర్, నందిగామ, కేశంపేట్, కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మంచాల్, యాచారం, మాడ్గుల.
వికారాబాద్ బషీరాబాద్, తాండూర్, యాలాల్, పెద్దెముల్, పూడూర్, పరిగి, దోమ, కుల్కచర్ల, చౌడపూర్.
