Gatha Vaibhava Song Launch
ఎంటర్‌టైన్మెంట్

Gatha Vaibhava: పవన్ కళ్యాణ్ అద్భుతమైన మాట చెప్పారు.. అందుకే తెలుగు నేర్చుకుని వచ్చానన్న హీరో!

Gatha Vaibhava: కన్నడ హీరో ఎస్.ఎస్ దుష్యంత్, ‘నా సామిరంగ’ ఫేమ్ ఆశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా చిత్రం ‘గత వైభవ’. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్‌పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ ట్రెమండస్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి బుధవారం ‘వర్ణమాల’ అనే సాంగ్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Andhra Pradesh: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?

కెరీర్ బెస్ట్ వర్క్ ఇచ్చారు

ఈ సాంగ్ లాంచ్ వేడుకలో హీరో దుశ్యంత్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ సునితో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కన్నడలో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. ‘గత వైభవ’ కోసం అద్భుతమైన స్క్రిప్టు రెడీ చేశారు. హిస్టరీ, మైథాలజీ, సనాతన ధర్మ ఎలిమెంట్స్ అన్నీ అద్భుతంగా కుదిరిన స్క్రిప్ట్ ఇది. తెలుగు, కన్నడ రెండు భాషల్లోనూ షూట్ చేశాం. ఆశిక రంగనాథ్ తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేశారు. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ తమ కెరీర్ బెస్ట్ వర్క్ ఇచ్చారని చెప్పగలను. శాండీ అద్భుతమైన మ్యూజిక్‌తో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా‌ను నేను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఈ పాటను అనురాగ్ అద్భుతంగా పాడారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. మా నిర్మాత కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ స్కేల్‌లో నిర్మించారు.

Also Read- Mohan Babu University: కోర్టు ఉత్తర్వును ధిక్కరించారు.. కాంట్రవర్సీపై మంచు విష్ణు స్పందనిదే!

తెలుగులోనే మాట్లాడాలని

రీసెంట్‌గా ఓజి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత, పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆర్ట్ మనుషుల్ని ఒక్కటి చేయాలని. ఆయన కన్నడ వెళ్తే కూడా అక్కడ చాలా అద్భుతంగా కన్నడలో మాట్లాడతారు. అందుకే నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడాలని ప్రయత్నించాను. టీజర్, సాంగ్ రిలీజ్ చేసాము. ఇంకా మున్ముందు కంటెంట్ రిలీజ్ చేయబోతున్నాము. ఈ సినిమా కంటెంట్‌లో మీకు నిజాయితీ కనిపిస్తే తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నవంబర్ 14న కన్నడ, తెలుగులో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ఇంకా చిత్ర బృందమంతా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది