Peddi leaked photos: ‘పెద్ది’ సినిమా నుంచి వైరల్ అవుతున్న పిక్స్..
RAM-CHARAN( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Peddi leaked photos: ‘పెద్ది’ సినిమా నుంచి వైరల్ అవుతున్న అనధికార పిక్స్.. నిర్మాతలపై మండి పడుతున్న ఫ్యాన్స్

Peddi leaked photos: రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే తాజాగా ఈ సినిమా షూట్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ నడుచుకుంటూ వస్తున్న సీన్ ను ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనధికారంగా విడుదలైన ఈ పిక్ చూసిన అభిమానులు నిర్మాతలపై మండి పడుతున్నారు. ఎవరు పడితే వారిని షూటింగ్ లోకి రానివ్వడంతో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని రామ్ చరణ్ అభిమానులు మూవీ టీంపై ఫైర్ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం విడుదలైన పిక్ ను చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా షూటింగ్ జరిగే ప్రాంతం నుంచి ఇలాంటి ఫోటోలు విడుదల అవడం మూవీ టీం అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఈ పిక్ తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Read also-Massive Explosion: బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగసిపడ్డ మంటలు.. ఆరుగురు స్పాట్ డెడ్

రామ్ చరణ్ అభిమానులకు ‘పెద్ది’ సినిమా మరో బ్లాక్‌బస్టర్ కానుకగా రానుంది. 2026 మార్చి,27న విడుదల కానున్న ఈ చిత్రం, స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ‘ఉప్పేన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ సినిమాను రాసి, దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం, పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ నేపధ్యంలో పెరిగిన క్రీడాకారుడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దివ్యేందు షర్మ (మిర్జాపూర్ ఫేమ్) కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు రామ్ చరణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Read also-Mass Jathara: ‘మాస్ జాతర’ నుంచి ‘హుడియో హుడియో’ లిరికల్ వీడియో వచ్చేసింది.. ఓ లుక్కేయండి..

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రామ్ చరణ్ పాట కంపోజిషన్ పూర్తియింది. లిరికల్ చేయడానికి వర్క్ జరుగుతుంది, అంటూ చెప్పుకొచ్చారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మొదటి సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ‘పెద్ది’ కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహ్మాన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ని కంపోజ్ చేసినట్లుగా ఇప్పటికే బుచ్చిబాబు సానా ప్రకటించారు. ఆడియన్స్, ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్‌ని ఏఆర్ రెహ్మాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్ శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైసూర్లో జానీ మాస్టర్ ఒక భారీ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేశారు. సుమారు 1000 మందికి పైగా డాన్సర్లతో ఈ సాంగ్ షూట్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాకు హైలెట్ గా ఉంటుందని మూవీ టీం చెబుతోంది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..