mass-jatara( IMAGE :X)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara: ‘మాస్ జాతర’ నుంచి ‘హుడియో హుడియో’ లిరికల్ వీడియో వచ్చేసింది.. ఓ లుక్కేయండి..

Mass Jathara: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మాస్ జాతర’. తాజాగా ఈ సినిమా నుంచి ‘హుడియో హుడియో’ అనే సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు నిర్మాతలు. దీనిని చూసిన రవితేజ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో మాస్ యాక్షన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ సినిమా ఫీస్ట్ కానుంది. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు మరియు మాస్ అంశాలతో నిండిన వినోదభరితమైన కుటుంబ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘మాస్ జాతర’ సినిమా, భారీ అంచనాల నడుమ అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది.

Read also-ED raids Mammootty properties: మలయాళ సూపర్ స్టార్ ఆస్తులపై మరో సారి దాడి చేసిన ఈడీ..

‘సామజవరగమన’ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత భాను ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. ఆయన హాస్యాన్ని రాయడం దానిని సహజంగా కథలో మిళితం చేయడంలో తనకు ఉన్న ప్రతిభను ఈ సినిమాలో చూపించారు. దర్శకుడికి మొదటి సినిమా అయినా ఎక్కడా అలా అనిపించకుండా.. మొదటి రోజు షూటింగ్‌ను సులభంగా పూర్తి చేసి చూపించారు. తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా సహాయపడినందుకు రవితేజకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టైటిల్ ఆలోచన రవితేజ నుంచే వచ్చిందని, దానికి “మనదే ఇదంతా” అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌ను జోడించినట్లు భాను వెల్లడించారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ వినోదభరితమైన పాత్రలో కనిపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలపై వచ్చిన పాజిటివ్ టాక్ మూవీ టీంకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది.

Read also-Kantara Chapter 1: ఆ రికార్డుకు చేరువలో ‘కాంతార చాప్టర్ 1’.. కన్నడలో మరో వెయ్యి కోట్ల సినిమా!..

నిర్మాతలు విడుదల  చేసిన లిరికల్ వీడియోను చూస్తుంటే.. చాలా రోజుల తర్వతా మాస్ మహారాజ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. శ్రీలీల, రవితేజల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. హుడియో హుడియో అంటూ మెదలవుతోంది లిరికల్ వీడియో.. నా గుండె గాలి పటమల్లే ఎగరేశావే నీ చుట్టుపక్కల తిరిగేలా గిరిగీశావే అంటూ సాగే లిరికల్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. భీమ్స్ అందించిన సంగీతం సంగీత ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. దేవ్ అందించిన లిరిక్స్ కు భీమ్స్ ప్రాణం పోశాడు. ఈ పాటను హేషమ్, అబ్దులు వాహబ్ తో కలిసి భీమ్స్ స్వరాలు అందించారు. విడుదలైన ఫుల్ సాంగ్ రవితేజ అభిమానులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమా విడుదల కోసం మాస్ మహారాజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది